భారత జట్టుపై అప్పుడే మాటల యుద్ధానికి దిగిన పాక్ మాజీ క్రికెటర్లు
Ex-Pakistan Cricketer Abdul Razzaq Predicts Virat Kohli. యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఇంకొన్ని వారాల్లో మొదలుకానుంది. భారత్, పాకిస్తాన్ జట్లు
By Medi Samrat
యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఇంకొన్ని వారాల్లో మొదలుకానుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ మ్యాచ్ అక్టోబరు 24న జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ కు ముందు పాక్ క్రికెటర్లు భారత జట్టుపై మాటల యుద్ధానికి దిగారు. పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ పాక్ టీమ్‌లో ఉన్న టాలెంట్‌ను చూస్తే.. ఇండియన్ టీమ్ కనీస పోటీ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యలు చేశాడు. పాక్ తో ఇండియా పోటీ పడుతుందని అనుకోవడం లేదని..తమ జట్టులో ఉన్న టాలెంట్ చాలా భిన్నమైనదని తెలిపాడు. భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు సాధారణంగా జరుగుతూ ఉండి ఉంటే ప్లేయర్స్ ఎంత ఒత్తిడి తట్టుకునే వాళ్లో తేలిపోయేదని అన్నాడు. రెండు టీమ్స్ మధ్య మ్యాచ్‌లు జరిగి ఉంటే.. పాక్ లో ఎంత టాలెంట్ ఉందో.. అది భారత్ లో ఎందుకు లేదో తెలిసేదని రజాక్ అన్నాడు.
కపిల్ దేవ్ కంటే కూడా ఇమ్రాన్ ఖానే గొప్ప ప్లేయర్ అనీ అతడు అన్నాడు. వసీం అక్రమ్‌లాంటి ప్లేయర్ అయితే ఇప్పటి వరకూ ఇండియాలో లేడని రజాక్ చెప్పుకొచ్చాడు. భారత్ కూడా మంచి జట్టే.. ఆ టీమ్‌లోనూ మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఉమర్‌గుల్ మాట్లాడుతూ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటన రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నాడు. ఇలాంటి సమయంలో జట్టుకు అండగా నిలవాలని విమర్శకులకు పిలుపిచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో టాప్ 4 చేరే సత్తా పాక్ జట్టుకు ఉందన్నాడు. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు రెండు, మూడ్రోజుల పాటు సోషల్ మీడియా, మీడియాకు దూరంగా ఉండాలని ఆటగాళ్లకు సలహా ఇచ్చాడు. ఇది హైవోల్టేజ్ మ్యాచ్ కావడంతో పాకిస్తాన్ మొత్తం భారత్‌ను ఓడించాలని కోరుకుంటుందని అయితే వార్తా కథనాలు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతాయని చెప్పాడు. టోర్నీ జరిగే యూఏఈ పరిస్థితులు పాక్ జట్టుకు సహకరిస్తాయని తెలిపాడు.