దావూద్ ఇబ్ర‌హీం బంధువే ఆ క్రికెటర్.. ఎంతగా పొగిడేస్తున్నాడంటే.?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ముస్లింల కోసం చాలా చేశాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రశంసించాడు.

By Medi Samrat  Published on  20 March 2024 3:15 PM IST
దావూద్ ఇబ్ర‌హీం బంధువే ఆ క్రికెటర్.. ఎంతగా పొగిడేస్తున్నాడంటే.?

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. ముస్లింల కోసం చాలా చేశాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ ప్రశంసించాడు. పాకిస్థాన్ జర్నలిస్ట్ హసన్ నిసార్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జావేద్ మియాందాద్ దావూద్ ఇబ్రహీం గురించి మాట్లాడాడు. మియాందాద్ కుమారుడిని దావూద్ ఇబ్రహీం కుమార్తె వివాహం చేసుకుంది.

"నాకు అతను దుబాయ్ నుండి చాలా కాలంగా తెలుసు. అతని కుమార్తె నా కొడుకును వివాహం చేసుకోవడం నాకు గౌరవం. ఆమె చాలా బాగా చదువుకుంది. కాన్వెంట్ మరియు విశ్వవిద్యాలయంలో చదివింది" అని మియాందాద్ చెప్పారు. అతను (దావూద్) ముస్లింల కోసం చాలా చేసాడు. అతడు చేసిన సేవ చిరకాలం గుర్తుండిపోతుందని తెలిపారు. మియాందాద్ కుమారుడు జునైద్.. దావూద్ కుమార్తె మహర్ఖ్‌ను వివాహం చేసుకున్నాడు. 2005లో దుబాయ్‌లో హై సెక్యూరిటీ మధ్య వీరి వివాహం జరిగింది. దావూద్ ఇబ్రహీం భారతదేశంలో వాంటెడ్ టెర్రరిస్ట్, 1993 ముంబైలో జరిగిన వరుస పేలుళ్లకు సూత్రధారి. దాదాపు 260 మంది ప్రాణాలు పోయాయి.

Next Story