బుమ్రాకు మళ్లీ గాయమైతే అతని కెరీర్ క్లోజ్ అవుతుంది.. బీసీసీఐకి హెచ్చరిక
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం ఆందోళన రేకెత్తించింది.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం ఆందోళన రేకెత్తించింది. బుమ్రాకు మళ్లీ వెన్ను గాయమైతే అతని కెరీర్ ముగిసిపోతుందని న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్‌బాండ్ బీసీసీఐని హెచ్చరించాడు. జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. 31 ఏళ్ల బుమ్రా ఆస్ట్రేలియా పర్యటనలో చివరిదైన ఐదో టెస్టు రెండో రోజు వెన్ను గాయంతో బాధపడ్డాడు.
బుమ్రాను సిడ్నీలో స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. మొదట్లో అతనికి వెన్నునొప్పి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే అది ఒత్తిడికి సంబంధించిన గాయంగా గుర్తించబడింది. దీంతో బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.
షేన్ బాండ్ ఒకప్పుడు టాప్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. అతడు 29 సంవత్సరాల వయస్సులో వెన్నునొప్పి శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. అదే వయసులో బుమ్రాకు కూడా ఆపరేషన్ జరిగింది. నిరంతరం గాయాలతో పోరాడిన బాండ్ తన కెరీర్‌ను 34 ఏళ్ల వరకు పొడిగించుకోగలిగాడు. షేన్ బాండ్ మొదట టెస్టులకు, తరువాత కొన్ని నెలల్లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.
ESPNcricinfoతో జరిగిన సంభాషణలో బాండ్ మాట్లాడుతూ.. 'చూడండి.. బుమ్రా బాగుండాలని నేను అనుకుంటున్నాను. కానీ వారి పనిభారం పడకుండా చూసుకోవడం ముఖ్యం. ఫ్యూచర్ టూర్‌లు, ప్రోగ్రాంలు చూసుకుని తనకు బ్రేక్ ఇచ్చే ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయో చూసుకోవాలి. ఏది ప్రమాదకరమైన సమయమో తెలుసుకోవాలి. IPL ఆడిన తర్వాత టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం ప్రమాదకరం.. వెంటవెంటనే మార్పు ప్రమాదకరం.
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బుమ్రాను జాగ్రత్తగా చూసుకోవాలని బాండ్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించాడు. బుమ్రాను రెండు టెస్టులకు మించి ఆడనివ్వకూడదని అన్నాడు. బుమ్రాకు మళ్లీ వెన్ను గాయమైతే అతని కెరీర్ ముగిసిపోతుందని హెచ్చరించాడు.
జస్ప్రీత్ బుమ్రా తదుపరి ప్రపంచకప్‌కు చాలా విలువైన ఆటగాడు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అతనిని రెండు మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడనివ్వను. ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి టెస్టు మ్యాచ్‌లు ఆడాలి. మీరు వాటిని ఎలా ప్లాన్ చేస్తారనేది కూడా చూడాలి.
బుమ్రాను భారత టెస్టు జట్టులో రెండు లేదా గరిష్టంగా మూడు మ్యాచ్‌ల్లో ఆడించాలి. అతడు ఫిట్‌గా ఉంటే.. పూర్తి విశ్వాసంతో మిగిలిన ఫార్మాట్‌లలో ఆడుతాడు. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ కాబట్టి.. అతకిని మళ్లీ అదే గాయమైతే, అతని కెరీర్ ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు మళ్లీ అదే స్థలంలో శస్త్రచికిత్స చేయవచ్చో లేదో నాకు తెలియదు అని బీసీసీఐని హెచ్చరించాడు.
ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది, అక్కడ జూన్ 28 నుంచి ఆగస్టు 3 మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడాల్సి ఉంటుంది. మెల్‌బోర్న్‌లో 52 ఓవర్ల మారథాన్ స్పెల్‌తో సహా ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా 151.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. భారత్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బాండ్ అభిప్రాయపడ్డారు.