సెహ్వాగ్ ఏంటి.. ఆసియా కప్ గురించి ఇలా అంటున్నాడు..!

Ex India Great On Who Will Win Asia Cup. ఆసియా కప్‌లో సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  6 Sept 2022 7:15 PM IST
సెహ్వాగ్ ఏంటి.. ఆసియా కప్ గురించి ఇలా అంటున్నాడు..!

ఆసియా కప్‌లో సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇక భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడానికి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లను ఓడించాల్సిన అవసరం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక సాధించిన భారీ విజయం వారిని మంచి స్థితిలో ఉంచింది. ఇక భారత్ తమ నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాలి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకతో భారత్ తలపడనుంది. భారత్ టోర్నమెంట్ లో ముందుకు వెళ్లడంపై భారత మాజీ ఓపెనర్, బ్యాటింగ్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

సూపర్ ఫోర్ లో భారత్‌ మరో మ్యాచ్‌లో అనుకోకుండా ఓడిపోతే టోర్నీ నుంచి తప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత్‌పై ఒత్తిడి ఉందని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో పేర్కొన్నాడు. భారత్‌పై విజయం సాధించిన తర్వాత పాక్ జట్టు మంచి స్థితిలో ఉన్నందున ఇది పాకిస్తాన్‌కు చాలా మంచి సంవత్సరం అని ఆయన అన్నారు. "పాకిస్థాన్ చాలా కాలం తర్వాత ఫైనల్‌లో ఆడుతుంది. ఆసియా కప్‌లో చాలా కాలం తర్వాత భారత్‌ను కూడా ఓడించింది. ఇది పాకిస్తాన్ సంవత్సరం కూడా కావచ్చు," అన్నాడు సెహ్వాగ్. సూపర్‌-4 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్‌ 6) శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడితే.. దాయాది పాకిస్తాన్‌కు ఆసియా కప్‌ ఎగరేసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. ఆసియా కప్‌లో చాలాకాలం తర్వాత పాక్‌ టీమిండియాపై విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే.. దాయాదికే ఆసియా ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయని సెహ్వాగ్ చెప్పడం భారత అభిమానులకు షాకింగ్ గా ఉంది.


Next Story