టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. సూపర్-12 దశలో భాగంగా జరిగిన నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్రిస్బేన్ లో జరిగిన ఈ గ్రూప్-1 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమేచేసింది . గ్లెన్ ఫిలిప్స్ (62), కేన్ విలియమ్సన్ (40) తప్ప కివీస్ బ్యాటర్స్ లో పెద్దగా రాణించలేకపోయారు. ఆఖర్లో మిచెల్ శాంట్నర్ (16 నాటౌట్), ఇష్ సోధీ (6 నాటౌట్).. ఇంగ్లండ్ బౌలింగ్ ముందు తేలిపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2, శామ్ కరన్ 2, మార్క్ ఉడ్ 1, బెన్ స్టోక్స్ 1 వికెట్ తీశారు.మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. కెప్టెన్ బ
ట్లర్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 73 పరుగులు చేయగా, హేల్స్ 40 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. లివింగ్ స్టోన్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మొయిన్ అలీ (5), బెన్ స్టోక్స్ (8), హ్యారీ బ్రూక్ (7) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 2, టిమ్ సౌథీ 1, మిచెల్ శాంట్నర్ 1, ఇష్ సోధీ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఇంగ్లండ్ గ్రూప్-1 పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరింది. ఇంగ్లండ్ ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించింది. ఈ గ్రూప్ లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.