యాషెష్ టెస్ట్ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ వేసిన ఫాస్ట్ బౌలర్..!

England Pacer Bowls Off-Spin On Day 4 Of 2nd Ashes Test. అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న రెండవ యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు ఆస్ట్రేలియా

By Medi Samrat  Published on  19 Dec 2021 1:46 PM GMT
యాషెష్ టెస్ట్ మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ వేసిన ఫాస్ట్ బౌలర్..!

అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న రెండవ యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో 79/4 వద్ద ఉన్న సమయంలో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌ వేయడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఓలీ రాబిన్సన్ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్పిన్‌ బౌలింగ్‌ చేస్తూ అందరనీ ఆశ్చర్యపరుస్తూ స్పిన్‌ బౌలింగ్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ లేకుండానే ఇంగ్లండ్‌ బరిలోకి దిగింది. కెప్టెన్‌ జో రూట్ పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గా బౌలింగ్‌ చేశాడు. రూట్ గాయం కారణంగా 4వ రోజు మొదటి సెషన్‌లో ఫీల్డ్‌లోకి రాలేదు. దీంతో రాబిన్సన్ స్పిన్నర్‌గా అవతారం ఎత్తాడు.

ఓలీ రాబిన్సన్ సన్ గ్లాసెస్ ధరించి బౌలింగ్ వేయగా కొంచెం స్పిన్‌ను రాబట్టగలిగాడు. పిచ్ నుండి కొంచెం బౌన్స్ చేయగలిగాడు. పేసర్ కాస్తా ఆఫ్-స్పిన్ వేస్తున్న అరుదైన సందర్భంలో ప్రేక్షకులు అతడిని బాగా ఎంకరేజ్ చేశారు. ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషెన్ లు కేవలం 2 పరుగులు మాత్రమే సాధించగలిగారు. ఈ ఇన్నింగ్స్ లో ఓలీ రాబిన్సన్ రెండు వికెట్లను తీశాడు.

మొదట ఇంగ్లండ్‌కు 468 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడం ద్వారా ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని మెరుగుపరుచుకుంది. అడిలైడ్‌లో D/N టెస్ట్ నాలుగో రోజు చివరిలో జో రూట్‌తో సహా ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్‌లో నలుగురిని అవుట్ చేశారు ఆసీస్ బౌలర్లు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 473 పరుగుల సాధిచంగా, ఇంగ్లండ్‌ 236 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 237 పరుగుల ఆధిక్యం ఆసీస్‌కు లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో 230-9 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా 473/9 decl (మార్నస్ లబుషెన్ 103, డేవిడ్ వార్నర్ 95, స్టీవ్ స్మిత్ 93) & 230/9 decl (ట్రావిస్ హెడ్ 51, మార్నస్ లబుషెన్ 51) ఆధిక్యంలో ఇంగ్లండ్ 236 (డేవిడ్ మలన్ 80, జో రూట్ 68; స్టార్క్ 4-37, నాథన్ లయాన్ 3-58) రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 82/4. ఇంగ్లండ్ విజయానికి 386 పరుగుల దూరంలో ఉంది.


Next Story
Share it