ఇంగ్లాండ్ సిద్ధమవుతోంది..!
England Men announce 17-player squad for opening two Tests against India. అసలు సిసలైన టెస్ట్ మ్యాచ్ మజాను ఎంజాయ్ చేయడానికి
By Medi Samrat Published on 22 July 2021 7:08 PM ISTఅసలు సిసలైన టెస్ట్ మ్యాచ్ మజాను ఎంజాయ్ చేయడానికి భారత క్రికెట్ అభిమానులు రెడీ అయిపోండి. ఆగస్టు 4 నుండి ఇంగ్లండ్ తో భారతజట్టు తలపడనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ కు భారతజట్టు చేరి చాలా రోజులే అయింది. ఇక టెస్ట్ సిరీస్ ప్రారంభమవ్వడమే ఆలస్యం..!
భారత్ తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ తన జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు బరిలోకి దిగబోయే 17 మంది బృందాన్ని ప్రకటించింది. బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్ స్టో, శామ్ కరన్ లు తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు గాయం కారణంగా స్టోక్స్ దూరమయ్యాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో టెస్టు అరంగేట్రం చేసిన ఓలీ రాబిన్సన్ కూ అవకాశం ఇచ్చారు.
హసీబ్ హమీద్ కూడా అవకాశాన్ని అందుకున్నాడు. జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లకు అవకాశం దక్కలేదు. తొలి టెస్ట్ ఆగస్టు 4న నాటింగ్ హాంలోని ట్రెంట్ బ్రిడ్జ్ లో మొదలుకానుంది. మొత్తం అయిదు టెస్ట్ మ్యాచ్ లలో భారత్ ఇంగ్లండ్ ను ఎదుర్కోనుంది. ఆసీస్ లో సిరీస్ గెలుచుకుని వచ్చిన భారత్ కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి ఎదురైంది. ఇక ఇంగ్లండ్ తో సిరీస్ లో భారత ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారో చూడాల్సి ఉంది.
ఇంగ్లాండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్ స్టో, డామ్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రాలీ, శామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, డామ్ సిబ్లీ, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్.