మరో రెండు రోజుల్లో పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్లు సిరీస్ లో పాల్గొంటూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ బృందంలోని ఏడుగురు కరోనా పాజిటివ్ అని తేలింది. పాకిస్థాన్‌తో జరగాల్సిన తొలి వన్డేకు రెండు రోజుల ముందే ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు, నలుగురు సహాయక సిబ్బంది COVID-19 పాజిటివ్ అని తేలింది. జట్టులో మిగిలిన సభ్యులందరినీ ప్రస్తుతానికి వీరితో వేరు చేయడమే కాకుండా ఐసోలేషన్ లో ఉంచారు. అయితే పాకిస్తాన్ సిరీస్ జరుగుతుందని అధికారిక ప్రకటనలో తేలింది. బెన్ స్టోక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించనున్నారు. క్రిస్ సిల్వర్‌వుడ్ జట్టుకు కోచ్‌గా తిరిగి వస్తాడని ధృవీకరించారు.
బ్రిస్టల్‌లో సోమవారం చేసిన పిసిఆర్ పరీక్షల తరువాత ఏడు పాజిటివ్ కేసులు నిర్ధారించబడినట్లు ఇసిబి పేర్కొంది. యుకె ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఐసోలేషన్ లో ఉండనున్నారు. ఇక మిగిలిన జట్టు 48 గంటల వ్యవధిలో తొలి వన్డేలో పాకిస్థాన్‌తో తలపడనుంది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. తక్కువ సమయంలోనే మంచి జట్టును తీసుకుని వచ్చామని.. ప్రస్తుతానికైతే సిరీస్ సాగుతుందని ఇసిబి తెలిపింది. కరోనా వ్యాప్తి చెందే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. బెన్ స్టోక్స్ తిరిగి జట్టు లోలో రావడం.. కెప్టెన్ గా విధులకు తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది ఇసిబి.