ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే..! అయితే ఆ జట్టును వైరల్ ఫీవర్ వెంటాడుతూ ఉండడంతో మొదటి టెస్ట్ మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా పర్యాటక జట్టు ఆటగాళ్లలో సగం మంది మ్యాచ్‌కు ఒక రోజు ముందు వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఇంగ్లాండ్- పాకిస్తాన్ మధ్య మొదటి టెస్ట్ వాయిదా పడే ఎక్కువగా ఉన్నాయని.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుతో తదుపరి చర్యలపై చర్చిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బుధవారం తెలిపింది. "కొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లు వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నందున మొదటి టెస్ట్ ప్రారంభానికి సంబంధించి PCB, ECB చర్చలు జరుపుతున్నాయి" అని బోర్డు ట్విట్టర్‌లో తెలిపింది.
డిసెంబర్ 1 నుంచి పాకిస్థాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా జట్టులోని 14 మంది సభ్యులకు గుర్తు తెలియని వైరస్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రేపు రావల్పిండిలో జరగనున్న టెస్ట్ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. ప్రస్తుతం ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫుడ్ పాయిజన్ అని కొందరు చెబుతున్నారు. ఫ్లూ లాంటి వైరస్ బారిన పడ్డట్లు మరికొందరు చెబుతున్నారు. టెస్టు మ్యాచ్‌కు ఒకరోజు ముందు కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చినట్లు తెలిసింది. గురువారం రావల్పిండి వేదికగా తొలి మ్యాచ్, రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో జరగనుంది. చివరి మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి కరాచీలో జరుగుతుంది.