ఎడ్జ్‌బాస్టన్‌లో భార‌త్‌ గెలుపు 'కల' నెరవేరదు.. ఎందుకంటే.?

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 2 రోజుల్లో పైచేయి సాధించింది.

By Medi Samrat
Published on : 4 July 2025 3:31 PM IST

ఎడ్జ్‌బాస్టన్‌లో భార‌త్‌ గెలుపు కల నెరవేరదు.. ఎందుకంటే.?

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు తొలి 2 రోజుల్లో పైచేయి సాధించింది. శుభ్‌మన్ గిల్ 269 పరుగులు, రవీంద్ర జడేజా 89 పరుగులు, యశస్వి జైస్వాల్ 87 పరుగులు చేయడంతో పాటు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇదొక్కటే కాదు, భారత బౌలర్లు రెండో రోజు స్టంప్స్ వరకు ఇంగ్లాండ్‌వి 3 వికెట్లు పడగొట్టారు. మూడో రోజు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను త‌క్కువ స్కోరుకు పరిమితం చేయాల‌ని భారత్ భావిస్తుండగా.. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయాల‌నే అలోచ‌న‌లో ఉన్నారు.

ఇదిలావుంటే.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు డ్రా అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. వర్షం ఇరు జట్లలో టెన్షన్‌ని పెంచింది. మ్యాచ్‌లో 4, 5వ రోజు బర్మింగ్‌హామ్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. వ‌ర్షం కార‌ణంగా ఆట ప్రభావితం అయితే మ్యాచ్ డ్రా దిశ‌గా సాగుతుంది. జులై 5, 6 తేదీల్లో బర్మింగ్‌హామ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Accuweather నివేదిక ప్రకారం.. జూలై 5న గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలు, క‌రిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. బర్మింగ్‌హామ్‌లో శనివారం 2.1 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని వాతావ‌ర‌ణ శాఖ అంచనా వేసింది. రోజుకు 1 నుండి 1.5 గంటల వరకు వర్షం పడే అవ‌కాశం ఉంది. ఇది మాత్రమే కాదు.. 87% వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం 99 శాతం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. నాల్గవ రోజు ఆట దెబ్బతింటుంది. జూలై 6న కూడా బర్మింగ్‌హామ్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు, క‌నిష్ట‌ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

ఆదివారం బర్మింగ్‌హామ్‌లో 2 మిమీ వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. దాదాపు 1 నుంచి 2 గంటలపాటు వర్షం కురుస్తుంది. 80 శాతం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం కూడా తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 44 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చివరి రోజు ఆట కూడా దెబ్బతింటుంది. దీంతో మ్యాచ్ డ్రా ముగియ‌నుంది. ఎలాగైనా రెండో టెస్టులో గెల‌వాల‌నుకున్న భార‌త్‌కు ఇది భారీ దెబ్బ‌.

Next Story