గబ్బా స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమిని చవిచూసింది. ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 161 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 రన్స్ చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ షాన్ మసూద్ అత్యధికంగా 39 రన్స్ చేశాడు. ఇఫ్తకర్ 22, వసీమ్ 26 రన్స్ చేశారు.
చేజింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ త్వరగా ఔటైనా.. బెన్ స్టోక్స్ 36, లివింగ్‌స్టోన్ 28 రన్స్ చేశారు. ఆ తర్వాత బ్యారీ బ్రూక్, సామ్ కర్రన్ భారీ షాట్లతో అలరించారు. బ్రూక్ 45, కర్రన్ 33 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. బ్రూక్ ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మరో 26 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్ ఫీల్డింగ్ ఘోరంగా ఉందని ఆ దేశ అభిమానులు చెబుతూ ఉన్నారు. పాకిస్థాన్ స్టార్ అయిన బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.