DJ బ్రావో ఇకపై సీఎస్‌కే జట్టుతో కనిపించడు.. ఎందుకంటే..?
డ్వేన్ బ్రావో అన్ని ఫార్మట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 27 Sept 2024 11:21 AM ISTడ్వేన్ బ్రావో అన్ని ఫార్మట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. బ్రావో 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మెంటార్‌గా చేరేందుకు సిద్ధంగా ఉన్నాడని ఐపీఎల్ ఫ్రాంచైజీ శుక్రవారం తెలిపింది.
బ్రావో ప్రస్తుతం IPLలో కోల్‌కతా నైట్ రైడర్స్ తోపాటు.. UAE లీగ్ ILT20లో అబుదాబి నైట్ రైడర్స్, USA మేజర్ లీగ్ క్రికెట్‌లో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
అంతకుముందు డ్వేన్ బ్రావో IPL చివరి రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా.. పురుషుల T20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.
అన్ని ఫార్మాట్లలో అసాధారణమైన ఆటతీరును కబరిచిన బ్రావో.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన T20 స్పెషలిస్ట్ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్రావో కెరీర్‌లో 582 T20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తం 631 వికెట్లు తీసుకొని.. దాదాపు 7,000 పరుగులు చేశాడు.
నైట్ రైడర్స్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. “డీజే బ్రావో మాతో చేరడం ఉత్తేజకరమైన పరిణామం. అతని అపారమైన అనుభవం.. లోతైన జ్ఞానంతో పాటు.. గెలవాలనే అతని కనికరంలేని పోరాటం.. మా ఫ్రాంచైజీకి, ఆటగాళ్లకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. CPL, MLC, ILT20తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఇతర ఫ్రాంచైజీలతో బ్రావో పాలుపంచుకున్నందుకు కూడా మేము సంతోషిస్తున్నామని పేర్కొన్నాడు.
DJ బ్రావో మాట్లాడుతూ.. “నేను CPLలో గత 10 సంవత్సరాలుగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌లో భాగమయ్యాను. వివిధ లీగ్‌లలో నైట్ రైడర్స్ కు వ్యతిరేకంగా ఆడాను. వారి ఎలా పనితీరుపై నాకు చాలా గౌరవం ఉంది. తదుపరి తరం ఆటగాళ్లకు మెంటరింగ్, కోచ్‌గా మారేందుకు ఇది నాకు సరైన వేదిక. వారితో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను అని అన్నాడు.