ఫ్రీగా ఆసియా కప్ మ్యాచ్ లు చూసేయొచ్చు

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ముఖ్యంగా తమ మొబైల్ పరికరాల్లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని

By Medi Samrat  Published on  22 Aug 2023 2:45 PM
ఫ్రీగా ఆసియా కప్ మ్యాచ్ లు చూసేయొచ్చు

క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ముఖ్యంగా తమ మొబైల్ పరికరాల్లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి ఇష్టపడే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఆసియా కప్ 2023 టోర్నమెంట్, రాబోయే ICC ప్రపంచ కప్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30న ప్రారంభమవ్వనుంది. ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ నేపాల్‌తో తలపడుతుంది.

డిస్నీ+హాట్‌స్టార్ లో ఆసియా కప్ 2023 ప్రత్యక్ష ప్రసారాలు త‌మ యాప్‌లో ఉచితంగా చూడవచ్చని తెలిపింది. ఇది కేవ‌లం మొబైల్‌కు మాత్ర‌మేన‌ని తెలిపింది. ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లను జియో సినిమా యాప్ ఉచితంగా ప్రసారం చేయగా.. ఇప్పుడు హాట్‌స్టార్ అదే ప్లాన్ అనుసరిస్తోంది. ఎక్కువ మంది త‌మ ఫ్లాట్‌ఫామ్‌ను చేరువకావడ‌మే ల‌క్ష్యంగా ఆసియా క‌ప్ మ్యాచ్‌ల‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనుంది. ఎలాంటి అవాంత‌రాలు లేకుండా మ్యాచ్‌ల‌ను చూడవ‌చ్చని ప్రోమో వీడియోలో డిస్నీ+హాట్‌స్టార్ తెలిపింది.

Next Story