భారత క్రికెట్ జట్టులో పక్షపాతం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సన్నీ

different rules for different players in Indian team. భారత క్రికెట్ జట్టులో పక్షపాత ధోరణి ఉందంటూ భారత క్రికెట్ లెజెండ్

By Medi Samrat  Published on  24 Dec 2020 3:56 PM IST
భారత క్రికెట్ జట్టులో పక్షపాతం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సన్నీ

భారత క్రికెట్ జట్టులో పక్షపాత ధోరణి ఉందంటూ భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని అన్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒకలా.. నటరాజన్ ను ఒకలా చూస్తోందని టీమ్ మేనేజ్మెంట్ మీద ఆరోపణలు గుప్పించారు.

భారత్ జట్టులో మరో ఆటగాడు నిబంధనలను తెలుసుకుని ఆశ్చర్యపోయి ఉంటాడు. జట్టులోకి కొత్తగా రావడంతో నోరు మొదపడం లేదని అన్నారు సన్నీ. అతను నటరాజన్. యార్కర్ల స్పెషలిస్ట్ అయిన అతడికి టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా తనకి లభించిన మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌ని స్వయంగా నటరాజన్‌ కు ఇచ్చాడు. అతను ఇటీవల తండ్రయ్యాడు. కానీ బిడ్డని ఇంకా చూడలేదు. యూఏఈ నుంచి నేరుగా అతడ్ని ఆస్ట్రేలియాకి తీసుకెళ్లారు. టెస్టు జట్టులో లేకపోయినా.. నెట్ బౌలర్‌గా అక్కడే ఉంచుకున్నారని అన్నారు.

విరాట్ కోహ్లీ తనకి పుట్టబోయే బిడ్డని చూసేందుకు భారత్‌కి వస్తున్నాడు. పుట్టిన బిడ్డని మొదటి సారి చూసేందుకు నటరాజన్‌ జనవరి మూడో వారం వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితని విమర్శించారు.

అనుష్క శర్మ జనవరిలో బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో ఆస్ట్రేలియా టూర్ నుంచి పితృత్వ సెలవులు తీసుకుని విరాట్ కోహ్లీ వచ్చేస్తున్నాడు. నటరాజన్‌ని ఎందుకు భారత్‌కి పంపలేదని గవాస్కర్ ప్రశ్నించారు. ఐపీఎల్ 2020 సీజన్ ఆఖర్లో నటరాజన్‌ భార్య ప్రసవించింది. అతడ్ని టీమిండియా మేనేజ్‌మెంట్.. యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకి తీసుకెళ్లింది. అక్కడ వన్డే, టీ20 సిరీస్‌లో ఆడించింది. టెస్టు సిరీస్ కోసం నెట్ బౌలర్‌గా అక్కడే ఉంచుకున్నారు.


Next Story