పృథ్వీ షా క్రికెటర్ అని తెలీదు: సప్నా గిల్

Didn’t even know who Prithvi Shaw is, Sapna Gill tells court. ముంబయిలో ఓ మహిళ, మరికొందరు తనపై దాడి చేశారంటూ టీమిండియా యువ క్రికెటర్

By Medi Samrat
Published on : 18 Feb 2023 8:30 PM IST

పృథ్వీ షా క్రికెటర్ అని తెలీదు: సప్నా గిల్

ముంబయిలో ఓ మహిళ, మరికొందరు తనపై దాడి చేశారంటూ టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తన స్నేహితుడితో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు యూట్యూబ్ ఇన్ ఫ్లుయెన్సర్ సప్నా గిల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆమెకు న్యాయమూర్తి ఈ నెల 20 వరకు పోలీస్ కస్టడీ విధించారు. న్యాయమూర్తి ఎదుట సప్నా గిల్ మాట్లాడుతూ, పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని, అతడు క్రికెటర్ అని భావించలేదని అన్నారు. పృథ్వీ షాను తన స్నేహితుడు సెల్ఫీ అడిగాడని, ఆ సమయంలో తాము ఇద్దరమే ఉన్నామని, పృథ్వీ షాతో ఎనిమిది మంది ఉన్నారని ఆమె అన్నారు. ఆ సమయంలో పృథ్వీ షా మద్యం మత్తులో ఉన్నాడని సప్నా గిల్ తరపు న్యాయవాది తెలిపారు. ఘటన జరిగిన 15 గంటల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోందని.. రూ.50 వేలు ఇవ్వాలంటూ తన క్లయింటు సప్నా గిల్ బెదిరించినట్టు పృథ్వీ షా బృందం చేసిన ఆరోపణల్లో నిజంలేదని న్యాయవాది చెప్పుకొచ్చారు.

క్రికెటర్ పృథ్వీ షాపై దాడి చేసిన యాక్టర్ స్వప్నా గిల్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ముంబైలో ఉంటూ పలు భోజ్ పురీ సినిమాల్లో నటించింది. బుధవారం సాయంత్రం పృథ్వీ షా అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్రతో కలిసి శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు డిన్నర్ కు వెళ్లాడు. అదే సమయంలో కొందరు సెల్ఫీ కోసం పృథ్వీ షా వద్దకు వచ్చారు. అభిమానుల మాటను కాదనలేకపోయిన షా వారిలో ఇద్దరితో సెల్ఫీలు దిగాడు. మరికొందరు వచ్చి సెల్ఫీ అడగటం, అందుకు అతడు అంగీకరించకపోవడంతో గొడవ మొదలైంది. నిందితులు పార్కింగ్ ప్లేస్ కు వచ్చి షా ప్రయాణిస్తున్న​ బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్‌ బ్యాట్లతో దాడికి దిగారు.


Next Story