ధోనీ నయా హెయిర్ స్టైల్.. నెక్ట్స్ లెవల్ అంతే..!
Dhoni New Hair Style Photos Goes Viral. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది
By Medi Samrat Published on
30 July 2021 2:45 PM GMT

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సరికొత్త హెయిర్ స్టైల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ లో అడుగుపెట్టిన కొత్తలో ధోనీ అనగానే తన పొడవాటి హెయిర్ స్టైలే గుర్తుకొచ్చేది. తర్వాత కూడా వివిధ రకాల హెయిర్ స్టైల్స్‌లో కనిపించేవాడు. అయితే.. గతేడాది అంతర్జాతీయ టెస్ట్, వన్డేల నుంచి ధోనీ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ధోని హెయిర్ స్టైల్స్ ఇక చూడలేం అనుకున్నారు ఫ్యాన్స్.
ధోనీ తన రెగ్యులర్ హెయిర్ స్టైల్ ను పక్కన పెట్టి కొత్తగా ట్రై చేశాడు. ఇది ఫాక్స్ హాక్ స్టైల్. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీం ధోనీ కొత్త హెయిర్ స్టైల్ పిక్స్ ను షేర్ చేశాడు. లెజెండరీ మ్యాన్ ధోనీ హెయిర్ కట్ చేసేప్పుడు ఎంజాయ్ చేసినట్లు తెలపగా… అసలు ఇతను 40 ఏళ్ల వ్యక్తి అంటే ఎవరైనా నమ్ముతారా.. ఇంకా 28సంవత్సరాల యంగ్ గా కనిపిస్తున్నాడని కొందరు, నెక్ట్స్ లెవల్ హీరో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Next Story