రోహిత్ శర్మ ప్లాన్ వర్కౌట్ అవుతుందా.. అతడిని దింపుతున్నాడుగా..!

Dhawal Kulkarni set to join Mumbai Indians squad for IPL 2022. ఐదు సార్లు ఛాంపియన్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది మాత్రం అతి దారుణంగా

By Medi Samrat  Published on  20 April 2022 7:15 PM IST
రోహిత్ శర్మ ప్లాన్ వర్కౌట్ అవుతుందా.. అతడిని దింపుతున్నాడుగా..!

ఐదు సార్లు ఛాంపియన్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది మాత్రం అతి దారుణంగా ఆడుతూ ఉంది. ఆరు మ్యాచ్ లు ఆడితే అన్నింట్లోనూ ఓడిపోయింది. ఇక వరుసగా మ్యాచ్ లు గెలిస్తే తప్పితే ప్లే ఆఫ్స్ కు ముంబై ఇండియన్స్ చేరుకోలేదు. ఇక చివరి అవకాశంగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మార్పును కోరుకుంటూ ఉన్నాడు. అదేమిటంటే ధవళ్ కులకర్ణి తిరిగి జట్టులోకి రావడమే..!

వెటరన్ పేసర్ ధవళ్ కులకర్ణి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో ముంబై ఇండియన్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. మెగా వేలంలో అమ్ముడుపోని పేసర్, స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ జట్టులో ఒక భాగం. ఈ సీజన్‌లో వారి మొదటి ఆరు గేమ్‌లు ఓడిపోవడంతో, MI జట్టు పాయింట్ల పట్టికలో ఆఖర్లో ఉంది. మరికొన్ని పరాజయాలు ఎదురైతే ప్లేఆఫ్ రేసు నుండి అవుట్ అయినట్లే. వారి ఓటములకు ప్రధాన కారణాలలో బౌలర్లు వికెట్లు తీయలేకపోవడం.. పరుగులను కట్టడి చేయలేకపోవడమే. జస్ప్రీత్ బుమ్రాకు ఇతర బౌలర్ల నుండి అసలు సహకారం అందడం లేదు. దీంతో కులకర్ణిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని భావిస్తూ ఉన్నారు.

ఐపీఎల్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లో జరుగుతుండటంతో స్థానిక ఆటగాడిగా కులకర్ణి తమ జట్టును గట్టెక్కిస్తాడ‌ని రోహిత్ శర్మ అంచనా వేస్తున్నాడు. కులకర్ణికి ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్‌, డీవై పాటిల్‌ మైదానాలతో పాటు పూణేలోని ఎంసీఏ స్టేడియంలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉండటంతో రోహిత్‌ అతనిని ఎలాగైనా జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ధవల్‌ కులకర్ణి ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. అతను గతంలో ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కులకర్ణి 2020, 21 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ జట్టులోనే ఉన్నాడు.













Next Story