ఆ మ్యాచ్ వేదిక మార్చే అవకాశం..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో పంజాబ్ కింగ్స్ (PBKS) ముంబై ఇండియన్స్ (MI) మధ్య ధర్మశాలలో జరగబోయే మ్యాచ్ వేదికను మార్చే అవకాశం ఉంది.

By Medi Samrat
Published on : 7 May 2025 8:01 PM IST

ఆ మ్యాచ్ వేదిక మార్చే అవకాశం..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో పంజాబ్ కింగ్స్ (PBKS) ముంబై ఇండియన్స్ (MI) మధ్య ధర్మశాలలో జరగబోయే మ్యాచ్ వేదికను మార్చే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నుండి మ్యాచ్ ను మార్చవచ్చని చెబుతున్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతను పెంచడం, ధర్మశాల విమానాశ్రయం మూసివేసినందున రెండు జట్లకు సంబంధించిన మ్యాచ్ వేదిక మారే అవకాశం ఉంది.

ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తరువాత, వాయువ్య భారతదేశంలోని అనేక విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. అందువల్ల, మే 11 ఆదివారం జరగనున్న IPL 2025 కు సంబంధించిన 61వ మ్యాచ్ కోసం ముంబై, పంజాబ్ జట్ల ప్రయాణ ఏర్పాట్లు భారీగా ప్రభావితమయ్యాయి.

ధర్మశాల నుండి ముంబైలోని వాంఖడే స్టేడియంకు మ్యాచ్ వేదికను మార్చడం గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మే 8 నాటికి ధర్మశాలకు చేరుకోవాల్సిన ముంబై ఇండియన్స్ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లను అన్వేషిస్తున్నట్లు ఇండియా టుడే నివేదించింది. ధర్మశాల, చండీగఢ్ విమానాశ్రయాలు మూసివేయడంతో ముంబై జట్టు ఢిల్లీకి వెళ్లి రోడ్డు మార్గంలో ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story