ఆసుపత్రిలో యుజ్వేంద్ర చాహల్ భార్య‌

Dhanashree Verma shares pic after surgery. ధనశ్రీ వర్మ.. తన భర్త, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుండి విడిపోయిందనే వార్తలు కొద్దిరోజుల కిందట వార్తల్లో నిలిచింది.

By Medi Samrat  Published on  3 Sept 2022 8:45 PM IST
ఆసుపత్రిలో యుజ్వేంద్ర చాహల్ భార్య‌

ధనశ్రీ వర్మ.. తన భర్త, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుండి విడిపోయిందనే వార్తలు కొద్దిరోజుల కిందట వార్తల్లో నిలిచింది. అయితే ఈ పుకార్లన్నింటినీ కొట్టి పారేస్తూ ధనశ్రీ ఓ పోస్ట్‌ను కూడా షేర్ చేసింది. అయితే ఆమెకు తాజాగా శస్త్రచికిత్స జరిగిందని తెలుస్తోంది. ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తనకు శస్త్రచికిత్స నిర్వహించారని.. అది విజయవంతమైందంటూ సంతోషకరమైన వార్తను పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ధనశ్రీ ఆసుపత్రి బెడ్‌పై కూర్చున్న చిత్రాన్ని పంచుకుంది.

"Successful surgery. Every setback is a setup for a comeback. Going to bounce back stronger than before cuz that's GODS PLAN. Performance upgrade. New ACl loading. Thank you for all your prayers & wishes. Love you," అంటూ పోస్టు పెట్టింది. ధనశ్రీ నువ్వు తొందరగా రికవరీ అవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నామని పలువురు కామెంట్లు పెట్టారు.

యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు పోస్టులు షేర్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యారు. డిసెంబర్ 2020లో గురుగ్రామ్‌లో ముంబైకి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చాహల్ వివాహం జరిగింది. ఈ జంట సోషల్ మీడియాలో పలు వీడియోలను పోస్టు చేస్తూ ట్రేండింగ్ లో ఉన్నారు.




Next Story