ధోనీ, కోహ్లీ కుమార్తెల‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన‌ ఢిల్లీ పోలీసులు

Delhi Police files FIR against those making lewd comments on Dhoni and Kohli's daughters. క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల కుమార్తెల‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు

By Medi Samrat  Published on  16 Jan 2023 12:09 PM GMT
ధోనీ, కోహ్లీ కుమార్తెల‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన‌ ఢిల్లీ పోలీసులు

క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల కుమార్తెల‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆరు సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఇచ్చిన నోటీసుల మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు క్రికెటర్ల కుమార్తెల‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు నిందితులపై చర్యలు తీసుకోవాలని స్వాతి మలివాల్ కోరారు.


ట్విట్టర్‌లో మలివాల్.. “నా నోటీసు తర్వాత.. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కుమార్తెలపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసి కటకటాలలోకి పంపిస్తామ‌ని ట్వీట్ చేశారు. క్రికెటర్లు కోహ్లి, ధోనీల కుమార్తెలు, భార్యలపై అసభ్యకరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేసిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ కోసం ఢిల్లీ పోలీసు సైబర్ సెల్‌కు ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్ నోటీసు జారీ చేశారు.Next Story
Share it