స్పందించిన ఢిల్లీ మెట్రో గర్ల్.. వాటిని అసలు పట్టించుకోనని తేల్చేసింది

Delhi Metro Girl' Speaks After Attire Video Goes Viral. ఢిల్లీ మెట్రోలో బికినీ లాంటి డ్రెస్ లో ఓ యువతి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By Medi Samrat  Published on  5 April 2023 8:47 PM IST
స్పందించిన ఢిల్లీ మెట్రో గర్ల్.. వాటిని అసలు పట్టించుకోనని తేల్చేసింది

ఢిల్లీ మెట్రోలో బికినీ లాంటి డ్రెస్ లో ఓ యువతి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదేం పద్దతంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకు పడుతున్నారు. మినీ స్క‌ర్ట్‌తో యువ‌తి ఢిల్లీ మెట్రోలో ప్ర‌యాణించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకే ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నారని భారీగా విమర్శలు వస్తున్నాయి.

ఈ విమర్శలపై సదరు యువతి స్పందించింది. ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోనని ఆ మహిళ చెప్పింది. "నేను ఏది ధరించాలనుకునేది నా వ్యక్తిగత స్వేచ్ఛ. పబ్లిసిటీ స్టంట్ కోసం లేదా ఫేమస్ అవ్వడం కోసం నేను ఈ పనిని చేయడం లేదు. ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో నేను పట్టించుకోను" అని ఆమె ఇండియా టుడేతో అంది. ఉర్ఫీ జావేద్‌ నుంచి తాను స్ఫూర్తి పొందలేదని, ఈ మధ్య వరకూ ఆమె ఎవరో నాకు తెలియదు.. ఒక స్నేహితుడు ఆమె ఫోటోను నాకు చూపించాడంతే అని తెలిపింది.


Next Story