'బెదిరించి తీసుకున్నారు.. రూ. 5.7 కోట్లు తిరిగి ఇవ్వాల్సిందే'.. శిఖర్ ధావన్ మాజీ భార్యకు కోర్టు షాక్‌..!

భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు తన మాజీ భార్యతో కొనసాగుతున్న వివాహ వివాదంలో పెద్ద ఉపశమనంగా, పాటియాలా హౌస్‌లోని ఫ్యామిలీ కోర్టు భారతదేశంలోని ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను అంగీకరించడానికి నిరాకరించింది.

By -  Medi Samrat
Published on : 26 Feb 2026 10:03 AM IST

బెదిరించి తీసుకున్నారు.. రూ. 5.7 కోట్లు తిరిగి ఇవ్వాల్సిందే.. శిఖర్ ధావన్ మాజీ భార్యకు కోర్టు షాక్‌..!

భారత క్రికెటర్ శిఖర్ ధావన్‌కు తన మాజీ భార్యతో కొనసాగుతున్న వివాహ వివాదంలో పెద్ద ఉపశమనంగా, పాటియాలా హౌస్‌లోని ఫ్యామిలీ కోర్టు భారతదేశంలోని ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను అంగీకరించడానికి నిరాకరించింది. ఆస్తి వివాదం కేసులో ధావన్‌కు అనుకూలంగా తీర్పునిస్తూ.. విదేశాల్లో జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటుపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ధావన్‌ మాజీ భార్య ఐషా ముఖర్జీని రూ.5.7 కోట్లు తిరిగి ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా.. ఈ మొత్తానికి తొమ్మిది శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించాలి.. అది కూడా ధావన్ కేసు దాఖలు చేసిన తేదీ నుండి. దోపిడీ, మోసం, బెదిరింపుల ద్వారా ఈ మొత్తాన్ని తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది.

ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన ప్రాపర్టీ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన ఉత్తర్వులు భారత్‌లో అమలు కావడం లేదని, ధావన్‌పై వాటిని అమలు చేయడం సాధ్యం కాదని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ గార్గ్ తీర్పు చెప్పారు. శిఖర్ ధావన్, అతని మాజీ భార్య ఐషా ముఖర్జీ మధ్య ఉన్న అన్ని సెటిల్మెంట్లను ఆయ‌న రద్దు చేశారు. ధావన్‌తో ఈ ఒప్పందాలు బెదిరింపులు, బలవంతం, మోసం, దోపిడీ ద్వారా జరిగాయని ప్రత్యేక న్యాయమూర్తి గుర్తించారు.

ఆస్ట్రేలియాకు చెందిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోర్టు ప్రతివాదిని ఆదేశించింది. ధావన్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కోర్టు జారీ చేసిన యాంటీ-సూట్ ఇంజక్షన్ లేదా ఇతర సంబంధిత ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రతివాదులను కూడా కోర్టు నిషేధించింది. ప్రతివాది గైర్హాజరైనందున కోర్టు డిక్రీ షీట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. అయితే కేసు ఖర్చులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు

Next Story