ఐపీఎల్ లో నేడు ఆసక్తికరమైన సమరం జరగనుంది. ఢిల్లీ కేపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే ఈ మ్యాచ్ విజయం చాలా ముఖ్యం. PBKS తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ముగిసిన తర్వాత కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి. తొమ్మిది మ్యాచ్‌లలో ఏడు పాయింట్లతో ఉన్న కోల్‌కతాకు వరుస విజయాలు చాలా అవసరం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 9 మ్యాచ్ లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించిన ఢిల్లీ కేపిటల్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ అవ్వాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(w), కరుణ్ నాయర్, KL రాహుల్, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్ (w), సునీల్ నరైన్, అజింక్యా రహానే (సి), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రాణా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి