ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని కష్టాలు.. పోలీసులకు ఫిర్యాదు

Delhi Capitals Players' Cricket Equipment Worth Lakhs Stolen In Transit. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచుల్లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది.

By M.S.R  Published on  19 April 2023 4:15 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని కష్టాలు.. పోలీసులకు ఫిర్యాదు

Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచుల్లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. గెలుపు బాట పట్టడం కోసం ఢిల్లీ చాలా కష్టాలు పడుతూ ఉండగా.. తాజాగా దొంగతనం ఢిల్లీ ప్లేయర్లని ఇబ్బంది పెడుతోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఢిల్లీకి బయలు దేరిన ప్లేయర్ల కిట్ బ్యాగ్స్ ను ఎయిర్ పోర్టులో దొంగిలించారు. కొంతమంది ఆటగాళ్ల బ్యాట్లు మిస్ అయ్యాయని, మరికొంతమంది ప్లేయర్ల ప్యాడ్లు, గ్లౌజ్, బూట్లు వంటి వస్తువులు మిస్ అయ్యాయని తెలుస్తోంది. ఈ ఘటనపై ఢిల్లీ ఫ్రాంచేజీ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఢిల్లీ కెప్టెన్ వార్నర్ కు చెందిన మూడు బ్యాట్లు, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ రెండు బ్యాట్లు, ఫిల్ స్టాల్ కు చెందిన మూడు బ్యాట్లు, యశ్ ధుల్ కు చెందిన ఐదు బ్యాట్లు దొంగిలించారు. ఆటగాళ్లందరివి కలిపి మొత్తం 16 బ్యాట్లు పోయాయి. ఒక్క బ్యాటు ధర రూ. లక్ష ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆటగాళ్ల కిట్ లపై ఎయిర్ పోర్ట్ లాజిస్టిక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

IPL 2023 పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అట్టడుగు స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఏప్రిల్ 15న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. జట్టు తదుపరి మ్యాచ్ గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది.


Next Story