ఢిల్లీతో తలపడనున్న బెంగళూరు.. విజ‌యం సాధించేది ఎవరో..?

Delhi Capitals vs Royal Challengers Banglore. IPL 2023 మ్యాచ్ 20లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది.

By Medi Samrat
Published on : 15 April 2023 1:00 PM IST

ఢిల్లీతో తలపడనున్న బెంగళూరు.. విజ‌యం సాధించేది ఎవరో..?

IPL 2023 మ్యాచ్ 20లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. శనివారం నాడు బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. విజయంతో టోర్నమెంట్ ను ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఆ తర్వాత వరుసగా రెండు ఓటములను నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఒక్క విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్‌లలోనూ గెలవలేకపోయింది. రెండు జట్లకు గెలుపు చాలా కీలకం. RCB తిరిగి విజయాలని సాధించాలని భావిస్తూ ఉండగా.. ఢిల్లీ టోర్నమెంట్ లో మొదటి విజ‌యం దక్కించుకోవాలని భావిస్తోంది.

RCB: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్(w), డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సుయాష్ ప్రభుదేశాయ్, ఆకాష్ దీప్ , మైఖేల్ బ్రేస్‌వెల్, సోను యాదవ్, వనిందు హసరంగా, ఫిన్ అలెన్, సిద్దార్థ్ కౌల్, మనోజ్ భాండాగే, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ

DC: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్(c), మనీష్ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్(w), కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, అన్రిచ్ నోర్ట్జే, ముఖేష్ కుమార్, అమన్ హకీమ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్ , ప్రవీణ్ దూబే, ఇషాంత్ శర్మ, రిలీ రోసోవ్, మిచెల్ మార్ష్, ఖలీల్ అహ్మద్, లుంగి ఎన్గిడి, ఫిలిప్ సాల్ట్, కమలేష్ నాగర్‌కోటి, చేతన్ సకారియా, రిపాల్ పటేల్, విక్కీ ఓస్త్వాల్


Next Story