ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న WPL వేలం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ ఈ సంవత్సరం అత్యంత ఖరీదైన మహిళా క్రికెటర్ గా మారవచ్చని అందరూ భావించారు. అయితే ఆమెను 2 కోట్ల రూపాయలకు కొన్నారు. అన్నాబెల్ సదర్లాండ్ కోసం బిడ్డింగ్ యుద్ధం మొదలుకాగా.. రూ. 40 లక్షల బేస్ ధరతో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ మధ్య ఆమె కోసం వేలంపాట మొదలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్డింగ్ వార్‌లో విజయం సాధించింది. సదర్లాండ్ ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
బిగ్ బాష్ లీగ్ లో సదర్లాండ్ అద్భుతంగా రాణించింది. ఇటీవల ముగిసిన టోర్నీలో, మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున సదర్లాండ్ 23 వికెట్లు తీసి 288 పరుగులు చేసింది. కేవలం 7.13 ఎకానమీని కలిగి ఉంది సదర్లాండ్. ఈ ఏడాది వేలంపాటలో అమ్ముడుపోయిన తొలి భారత క్రీడాకారిణిగా మేఘనా సింగ్ నిలిచింది. గుజరాత్ జెయింట్స్ ఆమెను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. WBBL 9 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, చమరి అతపత్తు అన్‌సోల్డ్ గా ఫస్ట్ రౌండ్ లో మిగిలింది. ఆమెను ఆఖర్లో కొనుక్కునే అవకాశం ఉంది.