అక్షర్ పటేల్ కు కరోనా.. ఐపీఎల్ ప్రశాంతంగా జరిగేనా..?

Delhi Capitals' Axar Patel tests positive for Covid-19. ఐపీఎల్‌-14 సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ అభిమానులు ఆశగా

By Medi Samrat  Published on  3 April 2021 3:57 PM IST
అక్షర్ పటేల్ కు కరోనా.. ఐపీఎల్ ప్రశాంతంగా జరిగేనా..?

ఐపీఎల్‌-14 సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ ఉండగా.. కరోనా వైరస్ భయం కూడా నిర్వాహకులను వెంటాడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు రద్దయ్యాయి. కానీ ఐపీఎల్ ను మాత్రం చాలా జాగ్రత్తగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. గత ఏడాది కూడా ఐపీఎల్ ను ఎటువంటి ఆటంకం లేకుండా బయో బాబుల్ లో టోర్నమెంట్ ను అద్భుతంగా నిర్వహించారు. ఈ ఏడాది భారత్ లో టోర్నమెంట్ ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఏడాది మరింత జాగ్రత్తగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. తాజాగా పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిర్వాహకులు షాక్ అవుతూ ఉన్నారు.

కోల్ కతా నైట్ రైడర్స్‌ ఆటగాడు నితీష్‌ రాణాకు కరోనా సోకిందనే వార్త అందరినీ కలవరపెడుతోంది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు కరోనా వైరస్‌ సోకింది. అక్షర్‌కు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందనే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. అక్షర్‌కు కరోనా వైరస్‌ సోకిందని.. ఇది చాలా దురదృష్టకరమని ఐపీఎల్ ఫ్రాంచైజీ తెలిపింది. ప్రొటోకాల్ ప్రకారం అక్షర్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. అక్షర్‌కు చేసిన కరోనా టెస్టులో ఆ వైరస్‌ సోకిందని తేలడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నియమావళి ప్రకారం అక్షర్‌ పది రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. అతనికి కరోనా నెగిటివ్‌ వచ్చిన తర్వాతే జట్టుతో కలవనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ లో అక్షర్‌ మొత్తం 27వికెట్లు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 10వ తేదీన సీఎస్‌కేతో ఆడాల్సి ఉంది.


Next Story