భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్‌మెన్‌..!

దక్షిణాఫ్రికా మాజీ టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on  22 Dec 2023 5:33 PM IST
భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్‌మెన్‌..!

దక్షిణాఫ్రికా మాజీ టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్ తర్వాత అతను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 36 ఏళ్ల ఎల్గర్ తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి క్రికెట్ సౌతాఫ్రికాకు తెలియజేశాడు. సిరీస్ ప్రారంభం కాకముందే ఎల్గర్ షాక్ ఇచ్చాడు. అయితే, అతడు భారత్‌తో జ‌రుగ‌నున్న‌ రెండు టెస్టులు ఆడనున్నాడు.

డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో తొలి టెస్టు, జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో రెండో టెస్టు జరగనుంది. రెండో టెస్టు తర్వాత ఎల్గర్ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ముగియనుంది. ఎల్గర్ కెరీర్‌లో 84 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 5,146 పరుగులు చేశాడు. అతను టెస్టు క్రికెట్‌లో 17 మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికాకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు.

ఎల్గర్ ఉద్వేగభరితమైన పోస్ట్‌లో ఇలా వ్రాశాడు - అందరూ చెప్పినట్లుగా అన్ని మంచి విషయాలు ముగిశాయి. నేను ఈ అద్భుత‌మైన‌ ఆట నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నందున.. భారత్‌తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ నా చివరి సిరీస్ అవుతుంది. నాకు చాలా ఇచ్చిన గేమ్. కేప్ టౌన్ టెస్టు నా చివరి టెస్టు. ప్రపంచంలో నాకు ఇష్టమైన స్టేడియంలో నా చివరి మ్యాచ్ ఆడతున్నాను. ఇదే స్టేడియంలో నేను న్యూజిలాండ్‌పై నా మొదటి టెస్టు పరుగులు సాధించాను. నా చివరి టెస్టు కూడా ఇక్కడే ఆడతాను. క్రికెట్ ఆడటం నా కల అయితే.. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గొప్ప విషయం. అంతర్జాతీయ స్థాయిలో 12 ఏళ్ల పాటు దీన్ని కొన‌సాగించ‌డం ఒక అపురూపమైన ప్రయాణం అని పేర్కొన్నాడు.

Next Story