ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి ఇంగ్లండ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఇరు జట్లు ఇంగ్లండ్ చేరుకుని ప్రాక్టీసులో నిమగ్నమయ్యాయి. మరోవైపు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. పాకిస్థాన్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో వార్నర్ తన చివరి టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు. వార్నర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో భారత్‌తో వచ్చే వారం జరుగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత త్వరలో ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో అతను పాల్గొనే అవకాశం ఉంది.
డేవిడ్ వార్నర్ 1 డిసెంబర్ 2011న న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు 102 టెస్టు మ్యాచ్‌లలో 187 ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ 45.58 సగటుతో 8,158 పరుగులు చేశాడు. ఈ సమయంలో వార్నర్ 25 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు సాధించాడు. డేవిడ్ వార్నర్ తన టెస్టు కెరీర్‌లో పాకిస్థాన్‌పై అత్యుత్తమ ఇన్నింగ్స్ (335*) ఆడాడు.