తొలి వన్డే.. అసీస్‌ను ఓడించినంత పనిచేసిన పాక్ బౌలర్లు..!
కెప్టెన్ పాట్ కమిన్స్ 32 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా తొలి వన్డేలో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది
By Medi Samrat Published on 4 Nov 2024 6:02 PM ISTకెప్టెన్ పాట్ కమిన్స్ 32 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా తొలి వన్డేలో పాకిస్థాన్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు 50 ఓవర్లు కూడా ఆడలేక 203 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బౌలర్లు మంచి ప్రదర్శన చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు మంచి ఆరంభం దక్కలేదు. జట్టు స్కోరు 3 వద్ద తొలి ఎదురుదెబ్బ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో సామ్ అయూబ్ అవుటయ్యాడు. అయూబ్ 5 బంతుల్లో 1 పరుగు చేశాడు. 7వ ఓవర్లో జట్టుకు రెండో దెబ్బ తగిలింది. స్టార్క్ అబ్దుల్లా షఫీక్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. షఫీక్ 12 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ 44 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఆడమ్ జంపా అతడిని బౌల్డ్ చేశాడు. దీని తర్వాత కమ్రాన్ గులామ్ 5, అఘా సల్మాన్ 12, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 44, షాహీన్ ఆఫ్రిది 24, ఇర్ఫాన్ ఖాన్ 22 పరుగులు చేశారు. హరీస్ రావుప్ ఖాతా కూడా తెరవలేదు. నసీమ్ షా 39 బంతుల్లో 40 పరుగులు చేశాడు. మహ్మద్ హస్నైన్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ పాట్ కమిన్స్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు సాధించారు. వీరితో పాటు షాన్ అబాట్, మార్నస్ లాబుషాగ్నే తలో వికెట్ తీశారు.
204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు కూడా మూడో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. మాథ్యూ షార్ట్ 4 బంతుల్లో 1 పరుగు చేశాడు. నాలుగో ఓవర్లో జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను 14 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 46 బంతుల్లో 44 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లిస్ అర్ధ సెంచరీని కోల్పోయాడు. 42 బంతులు ఎదుర్కొని 49 పరుగులు చేశాడు. మార్నస్ లాబుషాగ్నే 13 బంతుల్లో 16 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఆరోన్ హార్డీ 10 పరుగులు, సీన్ అబాట్ 13 పరుగులు చేశారు. కెప్టెన్ పాట్ కమిన్స్ 31 బంతుల్లో 32 పరుగులతో, మిచెల్ స్టార్క్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.