కిరాక్ ప్లేయ‌ర్‌తో సీఎస్‌కే ఒప్పందం.. జూనియ‌ర్‌ డివిలియర్స్ అంటారు..!

IPL 2025 సీజ‌న్ దాదాపు స‌గం పూర్త‌య్యింది. ఈ సీజ‌న్‌లో కొంత‌మంది ఆట‌గాళ్లు గాయ‌ప‌డ‌గా.. వారి స్థానంలో కొత్త ఆట‌గాళ్ల భ‌ర్తీ ప్ర‌క్రియ సాగుతుంది.

By Medi Samrat
Published on : 18 April 2025 4:07 PM IST

కిరాక్ ప్లేయ‌ర్‌తో సీఎస్‌కే ఒప్పందం.. జూనియ‌ర్‌ డివిలియర్స్ అంటారు..!

IPL 2025 సీజ‌న్ దాదాపు స‌గం పూర్త‌య్యింది. ఈ సీజ‌న్‌లో కొంత‌మంది ఆట‌గాళ్లు గాయ‌ప‌డ‌గా.. వారి స్థానంలో కొత్త ఆట‌గాళ్ల భ‌ర్తీ ప్ర‌క్రియ సాగుతుంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా యువ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఆటగాడు డెవాల్డ్ బ్రీవిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గాయ‌ప‌డిన‌ పేసర్ గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో బ్రెవిస్‌ని తీసుకుంది.

సీఎస్‌కే జ‌ట్టులో ఒక విదేశీ ఆట‌గాడి స్లాట్ మిగిలి ఉన్నందున వారు బ్రెవిస్‌ని తీసుకున్నారు. గత ఏడాది చివర్లో జరిగిన వేలంలో బ్రెవిస్ మూల ధర కేవలం INR 75 లక్షలు మాత్రమే అయినప్పటికీ.. CSK అతనికి INR 2.2 కోట్లతో ఒప్పందం చేసుకుంది.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే జ‌ట్టులో స్థానం ద‌క్క‌డం బ్రెవిస్‌కు కూడా చాలా గొప్ప విష‌యం. బ్రెవిస్‌ దక్షిణాఫ్రికా తరపున ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బ్రెవిస్‌ను AB డివిలియర్స్‌తో పోల్చుతారు. బ్రెవిస్ గ‌తంలో ముంబై ఇండియన్స్ తరపున మొత్తం 10 మ్యాచ్‌లు ఆడాడు. MLC, SA20లో ముంబై జ‌ట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

21 ఏళ్ల బ్రెవిస్ 81 T20లు ఆడాడు. స్ట్రైక్ రేట్ 145. ఈ సంవత్సరం ప్రారంభంలో SA20 లో కూడా బ్రెవిస్‌ చాలా మంచి ఫామ్ క‌న‌బ‌రిచాడు. టోర్నమెంట్‌లోని టాప్ 10 రన్‌గేటర్‌లలో ఒక‌డిగా.. బ్రెవిస్ అత్యధిక స్ట్రైక్ రేట్ 184.17తో టోర్నీని ముగించాడు.

బ్రీవిస్ ఈ సీజన్‌లో CSKకు రెండో రీప్లేస్‌మెంట్‌ ఆటగాడు.. అంత‌కుముందు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ముంబై ఆట‌గాడు ఆయుష్ మ్హత్రేతో సీఎస్‌కే ఒప్పందం చేసుకుంది. CSK తదుపరి గేమ్‌ ఏప్రిల్ 20న వాంఖడేలో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో జరుగుతుంది.

Next Story