చెన్నై సూపర్ కింగ్స్.. ఈ పేరు వింటే మనకు గుర్తుకు వచ్చే ముఖాలు ఒకటి మహేంద్ర సింగ్ ధోని, రెండవది సురేష్ రైనా..! ప్రస్తుతం ధోని కెరీర్ ముగిసినా ఐపీఎల్ లో చెన్నై కు కెప్టెన్ గా కనిపిస్తూ వస్తున్నాడు. ఇక సురేష్ రైనా గత రెండేళ్లుగా విఫలమవుతూ వస్తున్నాడు. ఓ ఏడాది వివాదం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మిస్టర్ ఐపీఎల్ దారుణ ప్రదర్శనను చూసి చాలా మంది బాధపడ్డారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ వేలంపాటలో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ రైనాను తీసుకోలేదు. ఇది చాలా మందిని బాధపెట్టే అంశం.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో చెన్నై ఫ్రాంచైజీ ప్రధాన ఆటగాడైన సురేష్ రైనాను తీసుకోలేదు. అతను మొదటి రౌండ్‌లో అమ్ముడుపోలేదు. యాక్సిలరేషన్ రౌండ్‌లో కూడా CSK రైనాపై ఆసక్తి కనిపించలేదు. రైనా CSKలో కనిపించని మొదటి సీజన్ ఇదే. అతను 2020 సీజన్‌ను ఆడలేదు.. ఈ ఏడాది రైనా ఐపీఎల్‌లో కూడా ఆడకపోవచ్చు.
రైనాను సూపర్ కింగ్స్ అభిమానులు చిన్న తలా అని పిలుస్తారు. 2022లో అతనితో లేకపోవడంతో అభిమానులు చాలా భావోద్వేగానికి గురయ్యారు. CSKలో రైనా, కెప్టెన్ ఎంఎస్ ధోనీ కలిసి చేసిన ప్రయాణం ముగిసిందని పలువురు అభిమానులు బాధపడ్డారు. సురేష్ రైనా ప్రయాణం ఐపీఎల్ లో ముగిసిందని అభిమానులు చెబుతూ పోస్టులు పెట్టారు. 2020 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంతో గొడవ కారణంగానే రైనాను కొనడానికి చెన్నై సిద్ధపడలేదని చెప్పే వాళ్లు కూడా ఉన్నారు.