MS Dhoni IPL Retirement : సీఎస్‌కే ఫ్యాన్స్‌కు భారీ గుడ్‌న్యూస్..!
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ వయసు 44 ఏళ్లు దాటింది.
By - Medi Samrat |
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ వయసు 44 ఏళ్లు దాటింది. కానీ అతను ఐపీఎల్ చివరి సీజన్‌లో కనిపించాడు. మహేంద్ర సింగ్ ధోనీ 2026లో ఐపీఎల్ ఆడతాడా లేదా అనే చర్చలు తరచుగా జరుగుతుంటాయి. గత కొన్ని సీజన్‌లుగా ఈ ప్రశ్న నిరంతరం ఉత్పన్నమవుతోంది. 2026 సీజన్‌కు కూడా ఇదే ప్రశ్న. అయితే ఇప్పుడు ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఈ సందేహాన్ని పూర్తిగా క్లియర్ చేశారు.
మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోవడం లేదని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. శుక్రవారం ‘క్రిక్‌బజ్’తో మాట్లాడిన ఆయన అమితానందంతో ఈ విషయాన్ని బహిర్గతం చేశాడు. ‘వచ్చే సీజన్‌లో ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని ధోనీ మాతో చెప్పాడు. అతడి నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. అనుభవజ్ఞుడైన ధోనీ యువతరానికి మార్గనిర్దేశనం చేయడంలో కీలకం కానున్నాడు’ అని విశ్వనాథన్ పేర్కొన్నాడు.
తదుపరి సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీని కూడా చూడవచ్చు. ఎందుకంటే అతను గత సీజన్ 2025లో కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. నిజానికి, రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నమెంట్ మధ్యలో గాయం కారణంగా ఔట్ అయ్యాడు, ఆ తర్వాత ధోనీకి కెప్టెన్సీ ఇవ్వబడింది. అయితే, గత ఐపీఎల్ సీజన్ CSKకి పీడకల. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి నిలిచింది.