వేలంలో రైనాను ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పిన సీఎస్‌కే సీఈవో..

CSK CEO Kasi Viswanath Explains Why Suresh Raina Wasn't Picked By Franchise. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు రోజుల వేలంలో వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా

By Medi Samrat  Published on  15 Feb 2022 6:13 AM GMT
వేలంలో రైనాను ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పిన సీఎస్‌కే సీఈవో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు రోజుల వేలంలో వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా అమ్ముడుపోని విష‌యం తెలిసిందే. కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ త‌రుపున‌ రైనా చేసిన అద్భుతమైన ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే.. రైనా అమ్ముడుపోక‌పోవ‌డం అభిమానులకు చాలా ఆశ్చర్యం కలిగించింది. రైనా మొద‌ట‌గా 2008 నుండి 2015 వరకు సీఎస్‌కేకి ప్రాతినిధ్యం వహించాడు. మ‌ర‌లా 2018 నుండి 2021 వరకు సీఎస్‌కే కోసం ఆడాడు. రైనా 205 మ్యాచ్‌ల‌లో 5,528 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో నాల్గవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. రైనా సీఎస్‌కే తరపున 4,687 పరుగులు నమోదు చేశాడు.

యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్.. రైనా కోసం ఫ్రాంచైజీ ఎందుకు వేలం వేయలేదో వివరించాడు. గత 12 సంవత్సరాలుగా సీఎస్‌కే జ‌ట్టులో అత్యంత నిలకడగా ఆడిన‌ ఆటగాళ్లలో రైనా ఒకడు. వాస్త‌వానికి.. రైనాను ఎంచుకోవ‌డం మాకు కష్టమైంది. అదే సమయంలో జట్టు కూర్పు.. ఫామ్‌పై ఆధారపడి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలని అన్నారు. కాబట్టి రైనా సీఎస్‌కే జట్టుకు సరిపోలేడని.. మేము భావించడానికి ఇది ఒక కారణమ‌ని అన్నారు.

బెంగళూరులో జరిగిన IPL-2022 వేలంలో సీఎస్‌కే దీపక్ చాహర్‌ను 14 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. తద్వారా టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. అయితే.. గ‌తంలో సీఎస్‌కే ప్రాతినిథ్యం ఇచ్చిన అంబటి రాయుడు- 6.75 కోట్లు, డ్వేన్ బ్రేవో- రూ. 4.40 కోట్లు, ఉతప్ప- రూ. 2 కోట్లకు ఫ్రాంచైజీ తిరిగి కొనుగోలు చేసింది.

గత సీజన్‌లో ధోనీ జట్టు టైటిల్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఫాఫ్ డు ప్లెసిస్‌ను తిరిగి పొందలేకపోవడంపై సీఎస్‌కే సీఈవో ఒకింత నిరాశకు లోనయ్యాడు. ఫాఫ్ డు ప్లెసిస్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. "మేము అతనిని కోల్పోయాం.. గత దశాబ్ద కాలంగా మాతో ఉన్న ఫాఫ్‌ను కోల్పోయాం.. ఇది వేలం ప్రక్రియ, డైనమిక్స్‌ అని ఆయ‌న అన్నారు.


Next Story