ఐపీఎల్ కు ముందు మాస్ లుక్ లో మహేంద్ర సింగ్ ధోని
CSK Captain MS Dhoni in All New Avatar Ahead of IPL 2022. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2022
By Medi Samrat Published on 27 Feb 2022 2:17 PM ISTభారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2022 ఎడిషన్‌తో అభిమానులను అలరించడానికి ముందుకు రానున్నాడు. ఇక మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ముందు యాడ్స్ లో చేసే సందడి కూడా అంతా ఇంతా కాదు. ఈ ఏడాది కొత్త సీజన్ కు ముందు కూడా మహీ రచ్చ చేయబోతున్నాడు. IPL 2022 కోసం ప్రసారకర్తలు మాజీ కెప్టెన్ తో కొత్త ప్రమోషనల్ వీడియోలను తీసుకుని రానుంది. ధోనీ కొత్త లుక్ తో సిద్ధమయ్యాడు. 40 ఏళ్ల ధోని ఖాకీ షర్ట్, ప్యాంట్ తో మాస్ గా కనిపించగా.. మీసాలు, పొడవాటి జుట్టుతో గుర్తుపట్టలేని విధంగా కనిపించాడు. బస్ కండక్టర్/డ్రైవర్ లుక్ లో ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. టోర్నమెంట్ ప్రసారకర్తలు స్టార్ స్పోర్ట్స్ మార్చి 26 నుండి ప్రారంభమయ్యే టోర్నమెంట్ కోసం ప్రమోషన్ వీడియోలకు సంబంధించి రెండు చిన్న క్లిప్‌లను పంచుకుంది.
Stay Tuned#DhonisNewLook #ComingSoon pic.twitter.com/S17D8L7JPD
— Star Sports (@StarSportsIndia) February 26, 2022
ధోని కొత్త లుక్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ నటించిన పూర్తి స్థాయి వాణిజ్య ప్రకటన కోసం వేచి ఉన్నారు. ధోని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి ఒక ప్రకటన వాణిజ్య ప్రకటన తీశారు. ధోని సన్నిహితుడు తన సోషల్ మీడియా ఖాతాలో ఇద్దరితో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. వైరల్ ఫోటోలో ధోని కొత్త హెయిర్‌స్టైల్ తో కనిపించాడు.ఐపీఎల్-2022 సీజన్ మార్చి 26 నుంచి జరగనుంది. ఫైనల్ మ్యాచ్ ను మే 29న నిర్వహిస్తారు. కరోనా టెన్షన్ లేకుండా.. 2022 సీజన్ ముంబయి, పూణే నగరాల్లోని 4 వేదికల్లోనే మ్యాచ్ లు జరపాలని నిర్ణయించారు. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లు ఆడనుండగా, 70 లీగ్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్ ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు. లీగ్ మ్యాచ్ లను ముంబయిలోని వాంఖెడే, డీవై పాటిల్, బ్రాబౌర్న్ స్టేడియంలలోను, పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలోనూ నిర్వహిస్తారు.