కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దక్షిణాఫ్రికాలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన కాస్త ఆలస్యమయింది. తొలుత షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉండగా.. దాన్ని డిసెంబర్ 26కు సవరించారు. తాజాగా దక్షిణాప్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ) సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్‌పై తరువాత వెల్లడిస్తామని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తెలిపిన సంగతి తెలిసిందే.
షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు : డిసెంబర్ 26 -30 ( సెంచూరియన్ )
రెండో టెస్టు : జనవరి 3 నుంచి 7 వరకు( జోహన్నెస్ బర్గ్)
మూడో టెస్టు : జనవరి 11 నుంచి 15 వరకు(కేప్‌టౌన్)
తొలి వన్డే : జనవరి 19(పార్ల్)
రెండో వన్డే : జనవరి 21(పార్ల్)
మూడో వన్డే : జనవరి 23(కేప్‌టౌన్)