భారత్‌ను ఛాంపియన్‌గా మార్చడానికి గంభీర్ తీసుకున్న ఈ 5 నిర్ణయాలపై తీవ్ర విమర్శలు..!

భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  10 March 2025 7:57 AM IST
భారత్‌ను ఛాంపియన్‌గా మార్చడానికి గంభీర్ తీసుకున్న ఈ 5 నిర్ణయాలపై తీవ్ర విమర్శలు..!

భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టోర్నీ ఆద్యంతం భారత జట్టు విజయ‌ రథంపైనే దూసుకెళ్లింది. రోహిత్ శర్మ అండ్ కంపెనీని ఏ ప్రత్యర్థి జట్టు ఓడించలేకపోయింది. ఈ ఘనత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మొత్తం జట్టుకే చెందుతుంది. అయితే కోచ్ గౌతం గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న 5 నిర్ణయాలు కూడా భారత్ విజయానికి దోహదపడ్డాయి. అయితే ఈ నిర్ణయాల్లో కొన్ని టోర్నీ ప్రారంభంలోనే విమర్శలకు గురయ్యాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తాత్కాలిక జట్టులో 2 మార్పులు జరిగాయి. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను తీసుకున్నారు. బ్యాకప్ ఓపెనర్‌ను మినహాయించి వరుణ్ చక్రవర్తిని 5వ స్పిన్నర్‌గా చేర్చారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, దుబాయ్‌లో భారత స్పిన్నర్లు సమర్థవంతంగా రాణించారు. జట్టులో వరుణ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నారు.

భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. అయితే, అతడు మొత్తం 5 మ్యాచ్‌లలో బెంచ్‌పైనే కూర్చున్నాడు. కేఎల్ రాహుల్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వాసం వ్యక్తం చేసింది. కీలక సమయంలో రాహుల్ బ్యాట్‌తో రాణించాడు. ఫైనల్‌లో రాహుల్ 33 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సెమీ ఫైనల్‌లో కూడా కేఎల్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. KL కూడా బంగ్లాదేశ్‌పై 41 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు.

వరుణ్ చక్రవర్తికి తొలి రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లో కూడా అవకాశం దక్కలేదు. దీని తర్వాత న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్‌లో ప్లేయింగ్‌ 11లో చోటు దక్కించుకున్న వరుణ్ మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో వరుణ్‌ 5 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్‌లో కివీ జట్టుపై 2-2 వికెట్లు తీశాడు.

అర్ష్‌దీప్ సింగ్ లాంటి ఫాస్ట్ బౌలర్ భారత జట్టులో ఉన్నాడు. దీని తర్వాత కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో మహ్మద్‌ షమీ, హర్షిత్‌ రాణాతో జట్టు మైదానంలోకి దిగింది. ఆ తర్వాత రానాను కూడా కూర్చోబెట్టారు. ఆ త‌ర్వాత‌ భారత జట్టు ఒక ఫాస్ట్ బౌలర్‌తో ఆట కొనసాగించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు భారత జట్టు ఇంగ్లండ్‌తో 3 వన్డేల సిరీస్‌ని ఆడింది. సిరీస్‌లోని మొదటి 2 మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా కేఎల్ రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు దిగాడు. అక్షర్ ఈ అవకాశాలను ఉపయోగించుకున్నాడు. బ్యాట్‌తో కూడా ముఖ్యమైన సహకారాన్ని అందించాడు. అతడు ఐదు మ్యాచ్‌ల‌లో వ‌రుస‌గా 8, 3*, 42, 27, 29 పరుగులు చేశాడు.

Next Story