లైగర్ తో సందడి చేసిన యువరాజ్ సింగ్

Cricketer Yuvraj Singh challenges 'liger' in a tug-of- war game. Find out who wins. ప్రస్తుతం టాలీవుడ్ అభిమానులందరూ పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్

By Medi Samrat  Published on  3 Oct 2021 12:07 PM GMT
లైగర్ తో సందడి చేసిన యువరాజ్ సింగ్

ప్రస్తుతం టాలీవుడ్ అభిమానులందరూ పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. లైగర్ అంటేనే పులికి-సింహానికి క్రాస్ బ్రీడ్ అనే సంగతి తెలిసిందే. ఇక ఈ న్యూస్ ఆర్టికల్ హెడ్డింగ్ చూసి భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ లైగర్ సినిమా సెట్స్ లో ఉన్నాడేమోనని మీరు అనుకోవచ్చు. అలాంటిదేమీ కాదు.. నిజమైన లైగర్ తో యువరాజ్ సింగ్ ఆడుకుంటూ కనిపించాడు. యువరాజ్ సింగ్ దుబాయ్‌లోని 'ఫేమ్ పార్క్' లో జంతువులతో సరదాగా గడిపిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

'లైగర్'తో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. యువరాజ్ మరియు అతని స్నేహితులు తాడు యొక్క ఒక చివర నుండి లాగారు, మరొక చివరను 'లైగర్' లాగుతోంది. ఇక మరిన్ని జంతువులను కూడా యువరాజ్ పలుకరించాడు. యువరాజ్ తన మెడలో ఒక పెద్ద పామును కూడా ఉంచుకున్నాడు. ఎలుగుబంటి, కోతి మరియు ఇతర క్రూరమృగాలను కూడా తన టూర్ లో భాగంగా పలుకరించాడు. "టైగర్ వర్సెస్ లైగర్" అంటూ వీడియోను పోస్టు చేశాడు యువరాజ్. నా భయాలను అధిగమించి ఒక సుందరమైన అనుభవాన్ని పొందానని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఫేమ్ పార్క్ అనేది అన్ని జంతువులను సురక్షితమైన వాతావరణంలో చూసుకునే స్వర్గంలాగా ఉందని అన్నాడు. ఇక్కడి సంరక్షకులు చాలా బాగా శిక్షణ పొందారు వారి అవసరాలన్నింటినీ చూసుకుంటారని తెలిపాడు.


Next Story
Share it