'ఐదేళ్లపాటు ఎవరూ మోసపోరు.'.. లైంగిక వేధింపుల కేసులో క్రికెట‌ర్‌కు ఉపశమనం

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ క్రికెటర్‌ యశ్‌ దయాల్‌ అరెస్ట్‌పై అలహాబాద్‌ హైకోర్టు స్టే విధించింది.

By Medi Samrat
Published on : 15 July 2025 4:10 PM IST

ఐదేళ్లపాటు ఎవరూ మోసపోరు... లైంగిక వేధింపుల కేసులో క్రికెట‌ర్‌కు ఉపశమనం

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ క్రికెటర్‌ యశ్‌ దయాల్‌ అరెస్ట్‌పై అలహాబాద్‌ హైకోర్టు స్టే విధించింది. 27 ఏళ్ల యశ్‌ దయాల్‌ పెళ్లి సాకుతో ఓ మహిళపై ఐదేళ్లపాటు దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జూలై 6న ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద యశ్‌ దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జస్టిస్ సిద్ధార్థ్ వర్మ, జస్టిస్ అనిల్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణ వరకు దయాళ్‌కు రిలీఫ్ ఇచ్చింది. ఆరోపించిన లైంగిక దోపిడీకి సంబంధించి కోర్టు ముఖ్యమైన పరిశీలనలు చేసింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం 'ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు మోసపోవచ్చు.. ఐదేళ్లు.. ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉంటారు.. ఐదేళ్లపాటు ఎవరూ మోసపోలేరు' అని మౌఖికంగా చెప్పింది.

ఐదేళ్ల క్రితం యశ్ దయాల్‌ను కలిశానని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. మహిళ వాంగ్మూలం ప్రకారం.. RCB ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికంగా ద‌గ్గ‌ర‌య్యాడు. అనంత‌రం యశ్ దయాళ్ పెళ్లిని వాయిదా వేస్తున్నాడని.. యశ్ దయాల్‌కు ఇతర మహిళలతో కూడా ప‌రిచ‌యాలు ఉన్నాయ‌ని త‌న‌కు తర్వాత తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ విష‌య‌మై యశ్ దయాల్‌ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్ల‌గా అరెస్టుపై స్టే విధించింది.. BNS సెక్షన్ 69 కింద FIR నమోదు చేయబడింది. ఇది మోసం ద్వారా పొందిన లైంగిక సంపర్కానికి సంబంధించిన సెక్ష‌న్‌. హైకోర్టు మంజూరు చేసిన అరెస్టు నుండి మధ్యంతర రక్షణ.. కేసు తదుపరి షెడ్యూల్ విచారణ తేదీ వరకు అమలులో ఉంటుంది.

Next Story