ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్‌కు యావ‌రేజ్‌ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ

2023 ప్రపంచ కప్ ఫైనల్, రెండవ సెమీ-ఫైనల్ (ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా) జరిగిన‌ నరేంద్ర మోదీ స్టేడియం

By Medi Samrat  Published on  8 Dec 2023 2:26 PM IST
ప్రపంచ కప్ ఫైనల్.. పిచ్‌కు యావ‌రేజ్‌ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ

2023 ప్రపంచ కప్ ఫైనల్, రెండవ సెమీ-ఫైనల్ (ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా) జరిగిన‌ నరేంద్ర మోదీ స్టేడియం, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్‌లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) యావ‌రేజ్‌ రేటింగ్ ఇచ్చింది. ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్.. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌కు యావ‌రేజ్‌ రేటింగ్ ఇవ్వ‌గా.. జవగల్ శ్రీనాథ్ రెండో సెమీ-ఫైనల్ జరిగిన‌ ఈడెన్ గార్డెన్ పిచ్‌కు రేటింగ్ ఇచ్చాడు. అయితే మ్యాచ్ సమయంలో ఈడెన్ గార్డెన్‌లోని అవుట్‌ఫీల్డ్‌కు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ "చాలా మంచి" రేటింగ్ ఇచ్చారు.

రెండో సెమీఫైనల్ కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జ‌ట్ల‌ మధ్య జ‌రుగ‌గా.. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా న‌మోదైంది. తుఫాను వికెట్‌పై తేమ కారణంగా.. దక్షిణాఫ్రికా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ పునరాగమనం చేసి 212 పరుగులు చేశారు. జవాబుగా ఆస్ట్రేలియా జట్టు 47వ ఓవర్ రెండో బంతికి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక ఫైనల్ గురించి మాట్లాడుకుంటే.. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండో సెమీఫైనల్ కంటే కాస్తా ఎక్కువ స్కోరు న‌మోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 240 పరుగులు చేసింది. బ‌దులుగా ఆస్ట్రేలియా 43వ ఓవర్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్‌కు ముందు ఇక్కడ ఆడటంపై కెప్టెన్ పాట్ కమిన్స్ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ రెండు పిచ్‌లకు యావరేజ్‌ రేటింగ్‌ రాగా.. మరోవైపు భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య సెమీఫైనల్‌ జరిగిన ముంబై వాంఖడే వివాదానికి కూడా కారణమైంది. ఇక్కడ భారత్ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ను భారత్ 327 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదింటిలో పిచ్‌కి ఐసీసీ యావ‌రేజ్‌ రేటింగ్ ఇచ్చింది.

Next Story