క్రికెట్ ఫీవర్.. భారత్ గెలవాలని పూజలు
Cricket fans prayers offered across the country for team india's win.దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. దాయాదులు భారత్
By తోట వంశీ కుమార్ Published on
24 Oct 2021 9:34 AM GMT

దేశంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. దాయాదులు భారత్, పాకిస్థాన్ దుబాయ్ వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ రోజు రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు తలపడనుండడంతో దేశంలో ఎక్కడ చూసినా.. ఎవ్వరిని కదిలించినా ఈ మ్యాచ్ గురించే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు టీ 20, వన్డే ప్రపంచ కప్‌లలో ఇరు జట్లు 12 సార్లు తలపడగా.. అన్ని సార్లు భారత జట్టే గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు కూడా భారత జట్టే విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పాక్‌పై గెలవడంతో పాటు టీ 20 ప్రపంచకప్‌ను సాధించాలని బెంగళూరు, ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాల్లో అభిమానులు పూజలు చేస్తున్నారు. భారత జట్టు టీమ్ సభ్యుల ఫోటోలకు హారతులు ఇస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే పలు నగరాల్లో మల్టీఫెక్స్‌లు, హోటళ్లు, పబ్‌లతో మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు చేధనకే మొగ్గు చూపే అవకాశం ఉంది.
Next Story