ఆస్ట్రేలియా జట్టులో కరోనా టెన్షన్
Corona Tension In Australia. ఆస్ట్రేలియా జట్టు మంగళవారం శ్రీలంకతో T20 ప్రపంచ కప్‌లో రెండవ సూపర్ 12 మ్యాచ్ ఆడనుంది.
By Medi Samrat Published on 25 Oct 2022 11:30 AM GMTఆస్ట్రేలియా జట్టు మంగళవారం శ్రీలంకతో T20 ప్రపంచ కప్‌లో రెండవ సూపర్ 12 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా కరోనా బారిన పడ్డాడు. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించాయని ఆస్ట్రేలియా జట్టు ప్రతినిధి తెలిపారు. టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకారం, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు ఎంపిక చేయడానికి జంపా అందుబాటులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడనివ్వలేదు. జంపా స్థానంలో అష్టన్ అగర్ కు ఆస్ట్రేలియా జట్టు అవకాశం ఇచ్చింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. T20 ప్రపంచ కప్ కోసం ICC రూపొందించిన నిబంధనల ప్రకారం, కరోనా పాజిటివ్ ప్లేయర్ కూడా మైదానంలోకి దిగవచ్చు.ఆదివారం ఐర్లాండ్‌కు చెందిన జాస్ డాక్రెల్ కూడా శ్రీలంక మ్యాచ్ సమయంలో కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ మ్యాచ్ ఆడించారు. శ్రీలంక-ఆస్ట్రేలియా జట్లు పెర్త్ వేదికగా తలపడుతూ ఉన్నాయి.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(సి), మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్