ఐపీఎల్ సీజన్-18 క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక స్టేట్‌మెంట్ చేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు దివ్యాంగులకు ఉచిత పాస్‌లు అందించబోతున్నట్లు అనౌన్స్ చేసింది. దివ్యాంగులకు కాంప్లిమెంటరీ పాస్‌లను అందించడానికి తమకు సంతోషంగా ఉందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
కాగా ఈ టికెట్లు కావాల్సిన వారు ఈ-మెయిల్‌కు పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, వ్యాలిడ్ డిజబులిటీ ప్రూఫ్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలనుకుంటున్నారో ఆ వివరాలు మెయిల్‌కు పంపించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రాధాన్యత ఆధారంగా పాసులు జారీ చేస్తామని ప్రకటించింది.