డిసెంబర్ 21 ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా భారత U-19 జట్టు అనుచితంగా ప్రవర్తించిందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆరోపించారు. పాకిస్తాన్ బౌలర్ భారత కెప్టెన్‌ను ప్రారంభంలోనే అవుట్ చేసిన తర్వాత అలీ రజా- ఆయుష్ మాత్రే మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో పేసర్‌పై విరుచుకుపడ్డాడు. ఫైనల్‌ను 191 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్ తమ రెండవ U-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం పాకిస్తాన్ U-19 కోచింగ్ సిబ్బందిలో భాగమైన సర్ఫరాజ్, ప్రస్తుత U-19 జట్టు ప్రవర్తన గతంలో తాను ఎదుర్కొన్న భారత జట్ల కంటే భిన్నంగా ఉందని అన్నారు. నేను పలు భారత జట్లతో ఆడాను, వారు క్రికెట్‌ను క్రికెట్‌గా తీసుకునేవారు. కానీ ఈ జూనియర్ జట్టు ప్రవర్తన ఫైనల్ అంతటా సరిగా లేదని సర్ఫరాజ్ అన్నారు. తమ జట్టు ఆటగాళ్లతో వేడుకలు బాధ్యతగా జరుపుకోవాలని చెప్పానని, భారత ఆటగాళ్ళు చాలా భావోద్వేగానికి గురవుతున్నారన్నానని తెలుసునన్నారు. క్రికెట్ కు అనుగుణంగా భారత క్రికెటర్ల హావభావాలు బాగా లేవని సర్ఫరాజ్ ఆరోపించారు.