అయ్యో పాకిస్థాన్ క్రికెట్.. బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసేసిందిగా..!

పాకిస్థాన్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది,

By Medi Samrat  Published on  3 Sep 2024 12:34 PM GMT
అయ్యో పాకిస్థాన్ క్రికెట్.. బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసేసిందిగా..!

పాకిస్థాన్ లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది, రెండవ టెస్ట్‌లో పాకిస్తాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి పాకిస్థాన్ పై తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్టుకు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ జట్టులో ఎలాంటి తడబాటు కనిపించలేదు. 6 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది.

జకీర్ హసన్ (40), నజ్ముల్ హొస్సేన్ శాంటో (38), మోమినుల్ హక్ (34) ఛేజింగ్‌లో కీలకమైన సహకారం అందించి పాకిస్థాన్ గడ్డపై తమ జట్టుకు అపూర్వమైన విజయాన్ని అందించారు. వర్షం కారణంగా మొదటి రోజు పూర్తిగా వాష్ అవుట్ అవ్వడంతో ఈ మ్యాచ్ ఫలితాన్ని ఇస్తుందని చాలామంది ఊహించలేదు. అయితే నాలుగు రోజుల వ్యవధిలో మ్యాచ్ లో ఎన్నో మలుపులు చోటు చేసుకోవడంతో ఫలితం లభించింది. బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయాన్ని దక్కించుకుంది. పాక్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 274, రెండో ఇన్నింగ్స్ లో 172 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో ఊహించని విధంగా పోరాడి 262 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లా రెండో ఇన్నింగ్స్ సూపర్ గా సాగడంతో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసి చారిత్రాత్మకమైన విజయాన్ని దక్కించుకుంది. లిట్టన్ దాస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. మెహదీ హసన్ మిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.

Next Story