Video : షమీ ఉపవాసం ఉండకుండా తప్పు చేసాడు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ చేసిన వ్యాఖ్య వివాదం రేపింది.

By Medi Samrat  Published on  6 March 2025 2:59 PM IST
Video : షమీ ఉపవాసం ఉండకుండా తప్పు చేసాడు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ చేసిన వ్యాఖ్య వివాదం రేపింది. మహ్మద్ షమీ ఆట సమయంలో ఉపవాసం చేయకుండా తప్పు చేసాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ మాట్లాడుతూ.. "తప్పనిసరి విధుల్లో ఒకటి 'రోజా' (ఉపవాసం) ఆరోగ్యవంతమైన పురుషుడు లేదా స్త్రీ 'రోజా' ఉండ‌కపోతే, వారు పెద్ద నేరస్థులు అవుతారు. భారత్‌కు చెందిన ప్రముఖ క్రికెట‌ర్ మహ్మద్ షమీ మ్యాచ్ సమయంలో నీరు లేదా మరేదైనా పానీయాన్ని సేవించాడు. ప్రజలు అత‌డివైపే చూస్తున్నారు. ష‌మీ ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో 'రోజా' ఉండ‌కుండా నీళ్లు కూడా తాగేశాడు. ఇది ప్రజలకు తప్పుడు సందేశాన్ని పంపుతుంది.. 'రోజా'ను పట్టించుకోకుండా నేరం చేశారురు. వారు ఇలా చేయకూడదు. షరియత్ దృష్టిలో అతడు నేరస్థుడు. అతడు దేవునికి సమాధానం చెప్పాలి." అని వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహ్మద్ షమీ ఉప‌వాసం ఉండ‌క‌పోవ‌డం.. ఎలాంటి నేరం కాద‌ని చాలా మంది చెప్పారు. ఒక వినియోగదారు.. దేశం ఎల్లప్పుడూ మతం కంటే పెద్దది అని మ‌ద్ద‌తిచ్చారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ 10 ఓవర్ల స్పెల్‌లో 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. షమీ కపూర్ కొన్నోలీ, కెప్టెన్ స్టీవ్ స్మిత్, నాథన్ ఎల్లిస్‌ల వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ అనంతరం మహ్మద్ షమీ మాట్లాడుతూ.. "నేను నా లయను అందుకుని జట్టుకు మరింత సహకారం అందించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇద్దరు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు జట్టులో లేరు. నాపై మరింత బాధ్యత ఉంది. నేను మాత్రమే ప్రధాన ఫాస్ట్ బౌలర్. మరొకరు ఆల్ రౌండర్ అత‌డికి పనిభారం ఉంటుంది. వికెట్లు తీయడం ద్వారా ముందుండాలి. నేను దానిని అలవాటు చేసుకున్నాను. నేను 100 శాతంప్ర‌ద‌ర్శ‌న‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ గాయపడ్డాడు. దీని తర్వాత అతనికి శస్త్రచికిత్స జ‌రిగింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతను పునరాగమనం చేశాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది. అందుకు ష‌మీ సిద్ధ‌మ‌వుతున్నాడు.

Next Story