గేల్ బాదుడు.. పగిలిపోయిన గ్లాస్

Chris Gayle’s gears up for CPL 2021 with glass-breaking SIX. కరేబియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. ఇక కరేబియన్ క్రికెటర్లలో పించ్ హిట్టర్లు

By Medi Samrat  Published on  27 Aug 2021 1:59 PM IST
గేల్ బాదుడు.. పగిలిపోయిన గ్లాస్

కరేబియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. ఇక కరేబియన్ క్రికెటర్లలో పించ్ హిట్టర్లు ఎంత మంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గేల్, పోలార్డ్, పూరన్.. ఇలా ఎంతో మంది బిగ్ హిట్టర్లు ఉన్నారు. ఇక సీజన్ మొదలైన మొదటి రోజే క్రిస్ గేల్ వార్తల్లో నిలిచాడు. యునివర్సల్‌ బాస్ క్రిస్‌ గేల్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021లో కొట్టిన భారీ సిక్స్‌కు స్కోర్‌కార్డ్‌ డిస్‌ప్లే చేసే స్ర్కీన్‌గ్లాస్‌ పగిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లీగ్‌లో సెంట్‌ కిట్స్‌ నెవిస్‌ పాట్రియోట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ బార్బడోస్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలా గేల్ స్క్రీన్ క్లాస్ ను పగులగొట్టాడు. జాసన్‌ హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ ఐదో బంతిని నేరుగా స్ట్రెయిట్‌ సిక్స్‌ సంధించాడు. బంతి నేరుగా ఉ‍న్న స్కోరుబోర్డు స్క్రీన్‌కు తగిలింది. అయితే ఈ మ్యాచ్‌లో గేల్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతులెదుర్కొన్న గేల్‌ ఒక సిక్సర్‌, ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో సెంట్‌ కిట్స్‌ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన సెంట్‌కిట్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్‌ విఫలమైనప్పటికి లోయర్‌ ఆర్డర్‌లో ష్రెఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ 53 నాటౌట్‌, డ్వేన్‌ బ్రావో 47 నాటౌట్‌తో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది.


Next Story