చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే విజృంభణ..గుజరాత్ టైటాన్స్‌పై భారీ విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్ లో విజృంభించి ఆడారు.
By Knakam Karthik
చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే విజృంభణ..గుజరాత్ టైటాన్స్‌పై భారీ విక్టరీ
ఐపీఎల్-2025 సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు నేడు తమ చివరి లీగ్ మ్యాచ్ లో విజృంభించి ఆడారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపరుగుల సునామీ సృష్టించారు. గుజరాత్ టైటాన్స్ తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 230 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (57), డెవాన్ కాన్వే (52) అద్భుత అర్ధసెంచరీలతో చెలరేగారు.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. బ్యాటర్లలందరూ రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41) టాప్ స్కోరర్. శుభ్మన్ గిల్ (13), షారుక్ ఖాన్ (19), అర్షద్ ఖాన్ (20), రాహుల్ తెవాతియా (14), రషీద్ ఖాన్ (12) పరుగులు చేశారు. జోస్ బట్లర్ (5), రూథర్ఫోర్డ్ (0) ఘోరంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, అన్షుల్ కాంబోజ్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, పతిరన ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే (8 బంతుల్లో 17 పరుగులు; 2 సిక్సర్లు) కూడా వేగంగా పరుగులు రాబట్టాడు. కానీ, షారుఖ్ ఖాన్ బౌలింగ్‌లో 12.3 ఓవర్ల వద్ద గెరాల్డ్ కోయిట్జీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ దశలో స్కోరు 144/3. కొద్ది సేపటికే, ధాటిగా ఆడుతున్న డెవాన్ కాన్వే (35 బంతుల్లో 52 పరుగులు; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 13.3 ఓవర్లలో 156/4. మొత్తంగా పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయంతో టోర్నీకి ముగింపు పలికింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు షాకిస్తూ 83 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.