చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌

Chennai Super Kings provide major injury update on Ben Stokes and Deepak Chahar. ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ఆనందంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది.

By Medi Samrat  Published on  9 April 2023 6:03 PM IST
చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌

ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ఆనందంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ గాయం తిరగబెట్టడంతో సీఎస్‌కే ఆడబోయే 4-5 మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు.ముంబైతో జరిగిన మ్యాచ్‌లో గాయం తిరగబెట్టడడంతో కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే వేశాడు చాహర్‌. చాహర్‌ గత సీజన్లోనూ ఇలాగే మధ్యలోనే వైదొలిగి, సీజన్‌ మొత్తానికే దూరం అయ్యాడు.

శనివారం కాలి గాయం కారణంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌కు స్టోక్స్ దూరమయ్యాడని CSK వెల్లడించింది. ఇంగ్లండ్ ఆల్-రౌండర్ మొదటి రెండు మ్యాచ్‌లను ఆడాడు, లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్ లో 15 పరుగులు చేశాడు. ఒక ఓవర్ కూడా బౌల్ చేశాడు. "జట్టు చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత చాహర్ గాయం తీవ్రతను గుర్తించడానికి స్కాన్‌లు చేయనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వైద్య సిబ్బంది ఇద్దరు ఆటగాళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. వారు కోలుకోవడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తారు" అని CSK ప్రకటనలో తెలిపింది.


Next Story