చ‌రిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్

Ben Stokes rewrites records in Test cricket.సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ స్టోక్స్ చ‌రిత్ర సృష్టించాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 8:37 AM GMT
చ‌రిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్

సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చ‌రిత్ర సృష్టించాడు. మౌంట్ మౌంగనుయి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో స్టోక్స్ ఈ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ రెండు సిక్స‌ర్ల‌ను బాది.. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా నిలిచాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ పేరు మీద ఉంది. 101 మ్యాచుల్లో మెక్ క‌ల్ల‌మ్ 107 సిక్స్‌లు కొట్టగా తాజా మ్యాచ్‌లో రెండు సిక్స‌ర్లు బాదిన‌ బెన్ స్టోక్స్ ఈ రికార్డును అధిగ‌మించాడు. స్టోక్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 90 మ్యాచుల్లో 109 సిక్స‌ర్లు బాదాడు. అయితే.. ఇక్క‌డో విశేషం ఏమిటంటే ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ జ‌ట్టుకు బ్రెండ‌న్ మెక్ క‌ల్ల‌మ్ కోచ్‌గా ఉన్నాడు.

టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాళ్ల జాబితా ఇది

బెన్‌స్టోక్స్ 109(ఇంగ్లాండ్‌), బెండ్ర‌న్ మెక్ క‌ల్ల‌మ్ 107(న్యూజిలాండ్‌), ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ 100(ఆస్ట్రేలియా), క్రిస్ గేల్ 98( వెస్టిండీస్‌), జాక్వెస్ క‌లిస్ 97( సౌతాఫ్రికా), వీరేంద్ర సెహ్వాగ్ 91(ఇండియా), బ్రియాన్ లారా 88(వెస్టిండీస్‌). క్రిస్ కెయిన్స్ 87(న్యూజిలాండ్‌)

Next Story